Tuesday, August 29, 2017

భారత్ మాతాకి జై...

భారత్ మాతాకి జై...

స్వాతంత్ర్యం సిద్దించిన వేళ
ఊరు వాడ సంబరం
భారత్ మాతాకి జై
అందాం  మనందరం

సత్యాఅహింసలే ఆయుధాలుగ మలచి
స్వతంత్ర పోరాటం చేసిన గాంధీ
స్వాతంత్ర్యం నా జన్మ హక్కని
నినదించిన తిలక్
బ్రిటీష్ ముష్కరులను హడలెత్తించిన
స్వతంత్ర సమరయోధులు
వారి త్యాగం మరువలేనిది
వారి చరితలు చిరస్మరణీయం
గుండె నిండా దేశభక్తితో
దేశమాతను కొలిచెదము
కులమత భేదం వీడుదాం
భారతమాతకి జై అందాం
                   - తోట యోగేందర్,
                   

No comments:

Post a Comment

శ్రీ రామనామం భవతారక మంత్రం...

  శ్రీ రామనామం భవతారక మంత్రం... ఇల పై శ్రీరామనవమి పండుగ రోజున  ఇంటింటా సందడి, ఉత్సాహం పెరిగే శుభ దినం ఉదయానే లేచి శ్రీరాముడికి  నమస్కరించి, ...