Thursday, June 6, 2013

తొలకరి పలకరింపు

తొలకరి పలకరింపు

తొలకరి పలకరించింది 
పుడమి తల్లి పులకరించింది
వేసవి వేడితో
ప్రఛండ భానుడి తాకిడితో
విలవిల లాడిన పుడమికి
జలాభిషేకం జరిగింది
గొంతెండుతున్న జీవరాశితో
మోడుబారుతున్న వృక్షజాతితో
కళావిహీనంగా మారిన పుడమి
తొలకరి పలకరింపుతో 
తన గాయాలను మరిచింది
నూతనత్వం సంతరించుకుంది
       -  తోట యోగేందర్

మండిపోయే సూరీడు పైన ఉన్నా... నీ దరి చేరదు అలసట చూడు..

  మండిపోయే సూరీడు పైన ఉన్నా... నీ దరి చేరదు అలసట చూడు...  కుండ లోని నీరు - ప్రాణానికి ఆధారం ,  దప్పిక తీర్చే అమృతం... గంట గంటకూ గుక్కెడ...