పరీక్షల ఒత్తిడి...
నిశ్శబ్దం నిండిన పరీక్ష గదిలో
ఉద్రిక్తత నిండిన మనసులు
ఒత్తిడితో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు
కాలం వేగంగా గడిచిపోతుంది
రాయాలనుకున్న జవాబులు మస్థిష్కంలో మెదలక
భయంతో మెదడును మధిస్తున్నారు కొందరు
నిద్రలేని రాత్రులు, నిరంతర భయంతో
బట్టీ పట్టి చదివిన చదువులు
గుర్తుకు రాక మదన పడుతున్నారు మరికొందరు
కానీ వారి మనస్సులో ఉపశమనం లేదు....
గ్రేడ్‌లు మాత్రమే ప్రతిభను నిర్వచించినప్పుడు.
బట్టి చదువులు కాక ఏముంటాయి?
సృజనాత్మకతలేదు... అవగాహనకు చోటే లేదు...
ఏడాది చదివిన చదువులను గంటల్లో పరీక్షిస్తారు..
జ్ఞాపక శక్తికి ప్రాధాన్యతిస్తూ ...
మక్కీకి మక్కి రాసిన వాళ్ళు టాపర్లు అవుతున్నారు.. కానీ
విద్యార్థులలో విభిన్న నైపుణ్యాలు పెంపొందాలి
దాని కనుగుణంగా విద్యా ప్రణాళిక ఉండాలి...
వాటిని పరీక్షించే విధంగా పరీక్షలు ఉండాలి ...
మన విద్యా వ్యవస్థ ఉపాధికి ఊతం ఇవ్వాలి...
- తోట యోగేంధర్
No comments:
Post a Comment