Thursday, March 13, 2025

హోలీ రంగుల హోలీ...


 హోలీ రంగుల హోలీ

నవ వసంతాలు విరిసే హోలీ

కుల మతాల బేధం చూపని హోలీ

బంధుమిత్రుల ఆనంద హేలీ

ఉత్సాహపు ఉరకలతో..

ఆనంద డోలికలతో…

రంగురంగుల తేజస్సుతో..

తనువు మనస్సు తడిచిపోయే..

తనువే ఇంద్రధనస్సులా మురిసిపోయే..

హోలీ వర్ణ కాంతుల హోలీ..




అంతరంగాన ఆప్యాయతలు కలిగించే హోలీ

నవరత్నాల వలయాలు విరజిమ్మే హోలీ

అశాంతి మనసులలో శాంతి పెంచే హోలీ

సమాజం నడిపే, సౌభాగ్యపు గాధయే హోలీ

తరాలు తేడా లేని, గుండె కలయికలతో

మానవత్వాన్ని కళ్ళముందు ఆవిష్కరించే హోలీ..

స్వేచ్ఛకు, సమానత్వానికి దోహదం చేసే

రంగు రంగుల వర్షంతో..

వెలుగు పండుగ, మనసుల సందడితో..

హోలీ, జీవన రేఖపై

 కొత్త ఆశలు చిగురింపజేసే హోలీ.





రంగు రంగుల కాంతులతో పులకరించే

సుఖ శాంతులు తెచ్చిపెట్టే ఈ హోలీ

తరతమ బేధము లేదు వయో పరిమితి కానరాదు

రంగుల సరదాలో అభిమానం మెండుగ

ప్రతి ఒక్కరిలో వెలుగులు నింపగ 

ఈ మహాపండుగ హోలీ 

రంగురంగుల రంగేళి హోలీ!

                                               - తోట యోగేందర్.


No comments:

Post a Comment

శ్రీ రామనామం భవతారక మంత్రం...

  శ్రీ రామనామం భవతారక మంత్రం... ఇల పై శ్రీరామనవమి పండుగ రోజున  ఇంటింటా సందడి, ఉత్సాహం పెరిగే శుభ దినం ఉదయానే లేచి శ్రీరాముడికి  నమస్కరించి, ...