శ్రీ రామనామం భవతారక మంత్రం...
ఇల పై శ్రీరామనవమి పండుగ రోజున
ఇంటింటా సందడి, ఉత్సాహం పెరిగే శుభ దినం
ఉదయానే లేచి శ్రీరాముడికి నమస్కరించి,
పూజలు చేసి కోవెలకు వెళ్లే విధానం...
కనులారా సీతారామ కళ్యాణాన్ని చూసి,
రామ భక్తి లో మునిగిపోతూ,
తనువు, మనసు ధన్యమగును ఈ దినం ...
రాముని కృపకు పాత్రులమై, ..
అందరమూ శ్రీరాముడి ఆశీర్వాదంతో
ధన్య జీవులం అవుతాం ఈ శుభ దినం...
భక్తజనుల పారవశ్యం కిరణాల్లా అంగీకృతం,
ఈ పండుగ రోజున భక్తజన మనస్సులో శాంతి ,
ప్రతి వ్యక్తి కన్నులలో కలిగేను అలౌకిక ఆనందం..
శ్రీ రామ నామమే భవ తారక మంత్రం...
శ్రీ రామ భక్తి పారవశ్యమే భక్త జన విజయం...
భక్తుల జీవితాల్లో కలుగును సకల శుభం....
పితృ వాక్య పరిపాలకుడిగా
ఏక పత్నీ వ్రతుడిగా
గొప్ప పరిపాలనా దక్షుడి గా
శత్రు సంహారంతో గొప్ప వీరుడి గా
శ్రీ రాముడి జీవితం అందించేను గొప్ప సందేశం..
శ్రీ రాముడిని పూజించడం పూర్వజన్మ సుకృతం..
- తోట యోగేందర్
No comments:
Post a Comment