Tuesday, August 29, 2017

కవిత

కవిత

ఓ విశ్వకర్మ
నువ్వు లేనిదే ఒక అడుగు కదలదు
ముందుకు  మానవజీవితం

ఈ విశాల ప్రపంచాన్ని నడిపిస్తోంది
నీ నైపుణ్యం

వడ్రంగిగ మారి నువ్వు
అన్నదాతకు చేయూతనిచ్చావు
నీ  చేతిలో తయారైన వ్యవసాయసామాగ్రి
రైతుకాసరయ్యింది పంట చేలు మురిసింది
జగతి ఆకలి తీర్చుటలో రైతుకు తోడయ్యావు నువ్వు
ప్రగతి దారి పట్టించావు

శిల్పివై దైవానికి రూపాన్నిచ్చావు
అద్భుత శిల్పాలుగ మలిచావు
నువు చెక్కని శిల్పం లేదు
నీ పనితనానికి హద్దులు లేవు

కంచరివై ఇత్తడితో అద్భతాలు చేశావు
వంట సామాగ్రిని వంటింటికి అందించావు
నీవులేనిదే వంట పాత్రలేదు
వంట గది చిన్నబోద్ది నీ పాత్రలేనిదే

కంసాలివై మహిళలకు ఆప్తుడవైనావు
నీ చేతిలో బంగారు లోహం ఆభరణమై మురుస్తోంది
తన విలువను పెంచుకుంటుంది
నీ సూక్ష్మసునిశిత నైపుణ్యంతో
స్వర్ణం విభిన్న రూపాలని దాల్చుతోంది

విశ్వకర్మలేని ఊరులేదు
విశ్వకర్మ సృష్టించని వస్తువు లేదు
జయహో విశ్వకర్మ...
జయ జయ హొ విశ్వకర్మ.
                        - తోట యోగేందర్,

No comments:

Post a Comment

ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...

  ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...   ఫోర్టిఫైడ్ రైస్ అనేది విటమిన్లు మరియు ఖనిజాలు వంటి అదనపు పోషకాలతో మెరుగుపరచబడిన ఒక రకమైన బియ్యం.  పోషక...