మహాత్మా గాంధీ
బానిసత్వపు సంకెళ్ళను
తెంచిన మహా మనిషి మన గాంధీ
పరాయిపాలన అంతమొందించుటకు
అహింసా మార్గంలో నడయాడిన ధీశాలి
మొక్కబోని ఆత్మవిశ్వాసంతో
దేశ ప్రజలను స్వాతంత్ర సంగ్రామంలో నిలిపి
బ్రిటీషు మత్త గజాలను గడ గడలాడించిన వ్యక్తి
అంటరానితనం నేరమని
అందరూ కలిసుండడమే స్వర్గమని తెలియచెప్పిన మహాశక్తి
కానరాడు ఇలలోన ఇలాంటి నేత
గాంధీ మార్గంలో నడవాలి మనమంతా
ఏ ఆయుదమూ లేకుండా
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి
ప్రపంచానికి భారతీయుల శక్తిని చాటిన మహానేత మన బాపూజీ
గాంధీ మార్గం సదా ఆచరణీయం
ఆయన బాటలో నడిచి అవుదాం విజేతలం
- తోట యోగేందర్
Tuesday, October 1, 2019
మహాత్మా గాంధీ
Subscribe to:
Post Comments (Atom)
శ్రీ రామనామం భవతారక మంత్రం...
శ్రీ రామనామం భవతారక మంత్రం... ఇల పై శ్రీరామనవమి పండుగ రోజున ఇంటింటా సందడి, ఉత్సాహం పెరిగే శుభ దినం ఉదయానే లేచి శ్రీరాముడికి నమస్కరించి, ...
-
వైకుంఠ ఏకాదశి పర్వదినం ప్రాశస్యం.. వైకుంఠ ఏకాదశి ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం, మార్గ...
-
శ్రీ రామనామం భవతారక మంత్రం... ఇల పై శ్రీరామనవమి పండుగ రోజున ఇంటింటా సందడి, ఉత్సాహం పెరిగే శుభ దినం ఉదయానే లేచి శ్రీరాముడికి నమస్కరించి, ...
-
పరీక్షల ఒత్తిడి... నిశ్శబ్దం నిండిన పరీక్ష గదిలో ఉద్రిక్తత నిండిన మనసులు ఒత్తిడితో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కాలం వేగంగా గడిచ...
No comments:
Post a Comment