Tuesday 21 July 2020

ఎంత పని చేసావే కరోనా...!


ఎంత పని చేసావే కరోనా...!
మనిషి శాస్త్ర విజ్ఞాన మేధస్సు కు
సవాలు విసి రావే కరోనా
ఎంత పని చేసావే కరోనా..!

మనిషి అహంకారాన్ని దెబ్బ తీసావే కరోనా
ఎంత పని చేసావే కరోనా..!

మానవ జీవితాన్ని అల్లకల్లోలం చేసావే కరోనా
ఎంత పని చేసావే కరోనా...!
మానవ సమాజంలో బయో త్పా తం సృష్టించావే కరోనా

ఎంత పని చేసావే కరోనా...!
ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరగని మహమ్మారిగా మారావే కరోనా
ఎంత పని చేసావే కరోనా...!
మానవ ప్రగతికి ప్రతిబంధకంగా మారావె కరోనా
ఎంత పని చేసావే కరోనా...!
మానవ జాతికి తీరని ద్రోహమే నీవు కరోనా...!
                     
                            - తోట యోగేందర్



Thursday 26 March 2020

కంటికి కనబడని క్రిమి...

కవిత
కంటికి కనబడని క్రిమి
హడలెత్తిస్తుంది జనాన్ని
కునుకు లేకుండా చేస్తుంది ప్రపంచాన్ని
అగ్ర రాజ్యాలు సైతం వణికి పోతున్నాయి 
గాలిలో దీపంలా మారాయి ప్రాణాల న్ని
ముందు జాగ్రత్త చర్యలే కాపాడాలి జనాన్ని కరచాలనం మరువాలి మనం
చేతులు జోడించి నమస్కరించడం శ్రేయస్కరం పదే పదే చేతులు కడుగడం
ముఖానికి మాస్కులు తొడగడం
అవసరమైతేనే ఇంటి నుండి బయటికి కదలడం ఇలాంటి కనీస జాగ్రత్తలు పాటించాలి ప్రతి ఒక్కరం
లేదంటే అవుతుంది  మరో ఇటలీ
విజ్ఞతతో కరోనాను కట్టడి చేద్దాం మనందరం

                                  - తోట యోగేందర్.

Wednesday 25 March 2020

ముందు జాగ్రత్త లతో కరోనాను నివారిద్దాం...

ముందు జాగ్రత్త లతో కరోనాను నివారిద్దాం...

ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి ముందు జాగ్రత్త చర్యలతోనే కట్టడి చేయాలి దాన్ని
 ఒకరి నుంచి మరొకరికి దరి చేరనీయొద్దు
సామాజిక దూరం పాటిద్దాం - చేతులు తరుచూ కడుగుదాం
మాస్కులు ధరిద్దాం - పరిశుభ్రత పాటిద్దాం అప్రమత్తతే మనకు రక్ష
సామాజక బాధ్యతతో స్వీయ నియంత్రణతో ఇంటికి పరిమితమౌదాం - కరోనాను తరిమేద్దాం

                                        -  తోట యోగేందర్

కరోనా కరాళ నృత్యం....!

కరోనా కరాళ నృత్యం


నిన్న మొన్నటిదాకా రోడ్లన్నీ కోలాహలంగా ఉండేవి
అవి నేడు జనాలు లేక వెలవెల పోతున్నాయి
ఒకరితో ఒకరు కలిసేట్టు లేదు
ఒకరితో ఒకరు చేయి కలిపేది లేదు
ఎవరి నోట విన్నా ఒకటే మాట 
అదే నేటి కరోనా వైరస్ మాట
కంటికి కనిపించని మహమ్మారి కరోన
కడగండ్లు మిగులుస్తోంది ప్రపంచాన
గొప్ప అభివృద్ది చెందిన దేశాలు సైతం
చిగురుటాకులై వణుకుతున్నాయి
ప్రజాజీవనం మొత్తం అస్తవ్యస్థమై 
ఇండ్లకే పరిమితమై నిట్టూరుస్తున్నారు
పాఠశాలలు ఆఫీసులు ఒకటేమిటి
ఆన్ని విభాగాలు కుదేలౌతున్నాయి
వ్యాపారులు వ్యాపారంలేక నీరసిస్తున్నారు
రోజు వారీ కూలీలు ఉపాధి లేక విలవిలలాడుతున్నారు
కరోనా కధ ముగిసేదెన్నడో
ప్రపంచానికి ఊరట కలిగేదెన్నడో?
                                                             - తోట యోగేందర్

Monday 14 October 2019

ధరల పెరుగుదలే.....


ధరల పెరుగుదలే 
సామాన్యులకు కలిగిస్తోంది మనో వ్యధ
రెక్కలు ముక్కలు చేసుకున్నా
తిప్పలు తప్పటం లేదు మరి ఎలా ?
రోజురోజుకూ పెరుగుతున్న
స్కూల్ ఫీజుల భారం ఒకవైపు
ఎన్ని చదువులు చదివినా
ఉద్యోగం గ్యారంటీ లేదు ఈనాడు
జీవిత పర్యంతం కష్టపడి సంపాదించినా
చాలదే చాలదు అరకొర ధనం
మరి ఏం చేయాలి మనం
అనారోగ్యం పాలైతే చుక్కలు చూపిస్తున్నాయి 
వైద్య ఖర్చులు
ఇక చూడాల్సిందే దిక్కులు
నిత్యావసర ధరలు చూస్తుంటాయి ఆకాశం వైపు
సామాన్యులు బెంబేలెత్తి  చూస్తారు దేవుడు వైపు
ఎప్పుడు తగ్గుతాయి వెతలు
సామాన్యుల జీవితాలలో మార్పు ఎప్పుడు ?
ఆదాయం పెరిగేదెప్పుడు
పేద ధనిక భేదాలు సమసిపోయేదెప్పుడు?
                                              - తోట యోగేందర్

Saturday 12 October 2019

వాన నీరు సంరక్షించి...

కవిత
వాన నీరు సంరక్షించి
భూగర్భ జలాలు పెంచి
భవిష్యత్ తరాలకు నీటి వనరులు పంచాలి
డబ్బు పంచడమే చాలదు
ఆస్తుల పంపకమే  కాదు
సహజ వనరుల పరిరక్షణ కూడా కావాలి
వాతావరణ పరిరక్షణ కి  పూనుకోవాలి
కాలుష్యాన్ని అరికట్టాలి
ప్రకృతిని ప్రేమించాలి
ప్రకృతితో సహజీవనం చేయాలి
ప్రాకృతిక సంపద పట్ల ప్రేమ దయ కలిగి ఉండాలి
సహజ వనరులకు విఘాతం కలగకుండా
సహజీవనం చేయటం తెలుసుకుని జీవించాలి
ప్రాకృతిక సంపద పట్ల ప్రేమ దయ కలిగి ఉండాలి
ప్రకృతిని ప్రేమించాలి
నేడు ప్రకృతితో మమేకమై జీవిస్తెనే 
రేపు భవిష్యత్తు తరాల జీవితం సుఖాంతమవుతుంది
                     - తోట యోగేందర్






Tuesday 1 October 2019

మహాత్మా గాంధీ

మహాత్మా గాంధీ
బానిసత్వపు సంకెళ్ళను
తెంచిన మహా మనిషి మన గాంధీ
పరాయిపాలన అంతమొందించుటకు
అహింసా మార్గంలో నడయాడిన ధీశాలి
మొక్కబోని ఆత్మవిశ్వాసంతో
దేశ ప్రజలను స్వాతంత్ర సంగ్రామంలో నిలిపి
బ్రిటీషు మత్త గజాలను గడ గడలాడించిన వ్యక్తి
అంటరానితనం నేరమని
అందరూ కలిసుండడమే స్వర్గమని తెలియచెప్పిన మహాశక్తి
కానరాడు ఇలలోన ఇలాంటి నేత
గాంధీ మార్గంలో నడవాలి మనమంతా
ఏ ఆయుదమూ లేకుండా
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి
ప్రపంచానికి భారతీయుల శక్తిని చాటిన మహానేత మన బాపూజీ
గాంధీ మార్గం సదా ఆచరణీయం
ఆయన బాటలో నడిచి అవుదాం విజేతలం

                                    - తోట యోగేందర్