Thursday 23 April 2015

నిరుద్యోగం నిర్వేదం

నిరుద్యోగం నిర్వేదం

నిరుద్యోగం నిర్వేదం
యువతరం నిర్వీర్యం 
సుధీర్ఘకాలం చదువులు చదివినా
కనిపించని ఉపాధి కోణం
వ్యయప్రయాసలతో 
పెద్దచదువులు చదివినా 
గ్యారెంటీ లేదు బ్రతుకు దెరువుకు
చదువుతోటే వృత్తి నైపుణ్యం 
కలగల్పి భవిష్యత్ పై బెంగ లేకుండా
తీర్చిదిద్దే విద్య అందితే 
నిరుద్యోగి వెతలు తీరును చక్కగా
                            తోట యోగేందర్

Tuesday 3 March 2015

ప్రతి ఊరికి చెరువుండాలి

ప్రతి ఊరికి చెరువుండాలి
పంటలు పండితేనే గా 
మనిషికి కడుపునిండేది
ఆపంటలు పండాలంటే 
ప్రతి ఊరికి జలసంపద కావాలి
బీడు భూములు సైతం
సిరులు పండించాలి
జలసంపద పెంపొందగ
ప్రతి ఊరికి చెరువుండాలి
భూమాత గర్భం 
జలంతో నిండుగ ఉండాలి
ప్రజల దాహం తీరాలి
ప్రతి పనికి జలమేగా ఆధారం
ఆజలాన్ని చెరువులలో 
ఒడిసి పట్టాలి
బంగరు భవితకు పునాది వేయాలి
చెరువులన్ని బాగు చేయగ
ప్రతి ఒక్కరు సైనికుడై కదలాలి
ప్రతి పల్లె అంతట
పచ్చదనంతో నిండాలి
తోట యోగేందర్

Monday 2 March 2015

జయహో స్వచ్ఛభారత్

జయహో స్వచ్ఛభారత్

పరిసరాల పరిశుభ్రం 
మనసుకేమో ఆహ్లాదం
రోగాలన్ని దూరం దూరం .....
పరిశుభ్రతే కావాలి మనందరి నినాదం
స్వచ్ఛభారత్ కార్యక్రమం 
ప్రజల మనసులలో నింపెను ఉత్తేజం
ఈ ఉత్తేజం నిలవాలి కలకాలం
పరిసరాల పరిశుభ్రం 
మనసుకేమో ఆహ్లాదం
మరపురాని బాధ్యతగా 
చిరస్థాయిగా నిలవాలి 
ప్రజలలోన ఈ స్ఫూర్తితో
భారత దేశం వెలగాలి 
స్వఛ్చంగా కలకాలం
                    తోట యోగేందర్


Thursday 22 January 2015

వింతవింత వ్యాధులు...!

వింతవింత వ్యాధులు..!

వింతవింత వ్యాధులు
ప్రబలే ఈ కాలంలో
అవగాహన లేకుంటే
అంతే సంగతులే
పరిశుభ్రత పచ్చదనం
మంచి వాతావరణం కాపాడును
మన బ్రతుకులనే
చిన్నచిన్న వ్యాధులకే భయపడక
ఎదురు నిలిచిపోరాడిన విజయం మనదేలే
సమిష్టిగా ఎదుర్కొంటే సమస్యలన్ని చిన్నవి లే
కష్టాలే మానవులను విజేతలుగా నిలుపునులే
              తోట యోగేందర్

Tuesday 13 January 2015

సంక్రాంతి పండుగ

సంక్రాంతి పండుగ 


ప్రకృతి పరవశంతో 
సంక్రాంతి పండుగ తెచ్చింది
రైతుల ఇంట పంటలు నింపి
ప్రాణికోటికి నవదాన్యాలను
బహుమతిగా ఇస్తుంది
ప్రకృతికి ప్రాణి కోటి 
సుఖసంతోషాలతో జీవించాలనే కోరిక
ఆకోరిక తీర్చగ సంక్రాంతి లక్ష్మిగా 
ధాన్య రాశులను వరంగా ప్రజలకు
అందించి దీవిస్తుంది
అలాంటి ప్రకృతినే 
ఆధునిక మానవుడు 
కాలుష్యపు కోరలతో నాశనం 
చేస్తున్నాడు మరి ఆ ప్రకృతి ప్రకోపిస్తే
జీవజాతికి నష్టం తప్పదు
ప్రకృతిని ప్రేమిద్దాం...
సంక్రాంతి శోభను చిరకాలం పొందుదాం..
                                                    తోట యోగేందర్