Tuesday 27 March 2018

తప్పు మనదే...

కవిత
తప్పు మనదే...
ఒప్పుకోకుంటే ముప్పు మనకే...
పైసలకు ఆశపడే మన ఓటింగ్
అందుకే మనకు మిగిలేది చీటింగ్
ఆత్మవిమర్శతో నడిస్తేనే భవిష్యత్ కు
మీనింగ్
లేదంటే మన బ్రతుకలన్నీ కన్ఫ్యూసింగ్
మంచికి లేనే లేదు గొప్ప రేటింగ్
మాస్ మసాలకే టీఆర్పీ రేటింగ్
అందుకే కనబడదు టీవీల్లో
మంచితనపు ఫ్లోటింగ్
ఇకనైనా మారాలి మన
బ్యాడ్ ఫాలోయింగ్
అప్పుడే సమాజంలో
మార్పు మైండ్ బ్లోయింగ్
                   - తోట యోగేందర్,

Sunday 25 March 2018

శ్రీరామ నవమి శుభాకాంక్షలతో

శ్రీరామ నవమి శుభాకాంక్షలతో...
అందాల రాముడు నీలమేఘశ్యాముడు
ఇలపై వెలిసిన భగవత్ స్వరూపుడు
ఏకపత్నీ వ్రతుడు సోదరప్రేమలో మేటిగా నిలిచాడు
రాజ్యపాలనలో సాటిరారు రాముడికెవ్వరు
రాక్షసత్వాన్ని అణిచిన వీరుడు
మానవులందరికి ఆదర్శప్రాయుడైన
అవతారపురుషుడు
అందుకో రామా ఈ భక్తుల పూజలు
కురిపించవయ్యా  నీ కరుణా కటాక్షాలు
                    - తోట యోగేందర్.

Wednesday 21 March 2018

కోకిలమ్మ పాటలు..

కవిత
కోకిలమ్మ పాటలు కొత్త చిగురు ఆశలు
జీవకోటి మైమరచే ప్రాకృతిక సొగసులు
పుడమికి శోభను తెచ్చిన ఆకుపచ్చ వన్నెలు
వేపపూల సోయగాలు మామిడి పిందెల గలగలలు
షడ్రుచుల సమ్మేళనంతో జీవిత పరమార్ధం తెలుపు  ఉగాది పచ్చడి రుచులు
తెలుగుదనం ఉట్టిపడే పండుగే ఉగాది
శుభములొసగి విజయమివ్వు హేవళంబి.
                                        -తోట యోగేందర్,

ఎక్కడున్నావు...

కవిత
ఎక్కడున్నావు... నువ్వెక్కడున్నావు...
మనిషితనం చచ్చిపోయి నిర్జీవివైనావు
ప్రేమ ఆప్యాయతలు ఏనాడో మరిచావు
దయా దాతృత్వం మచ్చుకైన కానరావు
దగా మోసం నేర్చి మనుషుల ఏమార్చుతావు
నీకసలేది పట్టదు సమాజం అంటే గిట్టదు
ఇరుగు పొరుగు వారినెపుడు అసూయతో చూస్తావు
కుళ్లు కుతంత్రాలతో కుమిలి చస్తుంటావు
ఎక్కడున్నావు.... నువ్వెక్కడున్నావు...
కృత్రిమ మేధస్సుతో కుస్తీపడుతున్నావు
నువ్వన్నది లేదంటూ శవమై బ్రతికున్నావు
                             - -తోట యోగేందర్,

Thursday 8 March 2018

నేనొక సామాన్యుణ్ణి

కవిత
నేనొక సామాన్యుణ్ణి
కల్లాకపటం లేని వాణ్ణి
మాయామర్మం తెలియని వాణ్ణి
దళారుల చేతిలో బలయ్యే వాణ్ణి
అధికారదాహానికి ఆహుతయ్యేవాణ్ణి
మార్కెట్ శక్తులకు చిత్తయ్యే వాణ్ణి
దౌర్జన్యాలను భరించే వాణ్ణి
కార్పోరేట్ల దోపిడికి గురయ్యే వాణ్ణి
నేనొక సామాన్యుణ్ణి
ఈ దేశంలో ... నేనొక అసహాయుణ్ణి...
                  - -తోట యోగేందర్,