Thursday 27 December 2012

మధురక్షణం

మధురక్షణం

ల్లి బిడ్డను ముద్దాడినపుడు
అదే మధురక్షణం
ప్రియుడు తన సఖిని హత్తుకున్నప్పుడు
అదే మధురక్షణం
జఠరాగ్నితో రగిలే జీవికి
ఆహారం దొరికితే
అదే మధురక్షణం
వినసొంపైన సంగీతం
చెవినపడ్డప్పుడు అదే మధురక్షణం
                                 -   తోట యోగేందర్

Wednesday 26 December 2012

జన్మధన్యం

జన్మధన్యం

సుగంధ పరిమళాలు వెదజల్లి
వర్ణశోభితమై ప్రకృతికి శోభనిచ్చే
పూల జన్మధన్యం
పచ్చపచ్చని చిగుల్లతో
నునులేత రెమ్మలతో
ఆహ్లాదం పంచే వృక్షజాతి జన్మధన్యం
గలగల ప్రవాహమై పారుతూ
జీవకోటి దాహం తీర్చే జలాల జన్మధన్యం
ప్రకృతి పారవశ్యానికి లోనై
పురివిప్పి నాట్యమాడే నెమలి జన్మధన్యం
పరోపకారం కోసం పాటు పడే
మహానుభావుల జన్మధన్యం
                          -  తోట యోగేందర్

Monday 24 December 2012

మానవ నైజం ...!

మానవ నైజం ...!

పుట్టుకతో లేదు ఏ కోరిక
పుట్టుకతో లేవు ఆశ నిరాశ
పుట్టుకతో లేవు భయభ్రాంతులు
బాల్యంలో మొదలైనాయి ఆశలు
యవ్వనంతో ఆకాశాన్నంటాయి
ప్రపంచమే నేర్పింది అన్నింటిని ప్రాణికోటికి
అయితే మానవజాతికి తప్ప లేదు
ఏ ఇతర ప్రాణికోటికి అత్యాశ, స్వార్ధం
ఆ రోజుకు కడుపు నింపుకుని
సంతృప్తినొందుతాయి
కాని మానవుడు తరతరాలకు
తరగని సంపద కావాలంటాడు
అందరిపై తనదే పైచేయి కావాలంటాడు
ఆ అత్యాశే నేడు మానవత్వాన్ని మింగేస్తుంది
మానవుణ్ని దానవుడిగ మారుస్తుంది
                                         - తోట యోగేందర్
 
 
 

Sunday 23 December 2012

ఇరుకౌతున్న జనావాసాలు !

ఇరుకౌతున్న జనావాసాలు !

జనాభా పెరుగుతోంది
వారితోపాటు వాహనాలు పెరుగుతున్నాయ్
ఒకప్పుడు నడిచేవారి సంఖ్య అధికం
నేడు వాహనాలకు అలవాటు పడ్డవారి సంఖ్య అధికం
బజారు కెళ్ళాలన్న ... సినిమా కెళ్ళాలన్న....
దోస్త్ ఇంటికెళ్ళాలన్న.... పర్ లాంగు దూరంలోని గుడి కెళ్ళాలన్న...
మోటార్ సైకిలో ... కారో వాడేస్తున్నారు
అంతే అసలే జనసంఖ్య పెరిగి ఉక్కిరిబిక్కిరౌతున్న జనావాసాలకు
వాహనాల సంఖ్యమితిమీరి
పార్కింగ్ చోటు లేక రోడ్లపై నిలుచుంటున్నాయి
ఈ దెబ్బకు రోడ్లన్ని ఇరుకౌతున్నాయి
ఇంకొంతకాలానికి మనిషికి రెండు, మూడు వాహనాలతో
జనసంఖ్యను వాహనాలు మించునేమో
కాలుబెట్ట సందు లేక ఇక్కట్లు తప్పవేమో...
                                                -   తోట యోగేందర్

మౌనం

మౌనం

మౌనం
మనిషిలోని మహోగ్రరూపం
మౌనం
జవాబు దొరకని
ఎన్నో ప్రశ్నలకు
అదో సమాధానం
మౌనం
మేధోమధనకు తొలిద్వారం
మౌనం
మనసులోని భావాల
ప్రవాహానికి మార్గం
                          - తోట యోగేందర్

Saturday 22 December 2012

మాతృభాషలో అభ్యసన


మాతృభాషలో అభ్యసన

మాతృభాషలో అభ్యసన
అర్ధవంతంగా జరుగుతుంది
అమ్మభాషలో అభ్యసన
అలుపెరగక జరుగుతుంది
కమ్మదనం... అమ్మదనం
మాతృభాషలో ఉన్నది
పరభాషావ్యామోహంతో
ఆంగ్లమాధ్యమంలొ చదివితే
విషయజ్ఞానం అందక
పరిపూర్ణత చేకూరదు
ప్రాధమిక విద్యనైన
మాతృభాషలో గరిపితే
మనసు పరిమళిస్తుంది
విలువలు నేర్పిస్తుంది
                                 - తోట యోగేందర్

Tuesday 18 December 2012

రైతన్న..!

రైతన్న..!

పొలాలు దున్ని
పంటలు పండించేది రైతన్న
పంటలతో జనానికి
ఆకలి తీర్చేది రైతన్న
ప్రకృతి కరుణిస్తే
దిగుబడి అందొస్తే
రైతన్నకు పండుగ
ప్రకృతి ప్రకోపిస్తే
రైతన్నకు దండగ
వానలు కురవాలని
కాలువలు నిండాలని
ప్రకృతి కరుణించాలని
ఆశపడేది రైతన్న
విత్తనాలు మొలకెత్తితే
ఆ మొలకలే మొక్కలైతే
ఆనందించేది రైతన్న
ప్రకృతి కరుణకోసం
పరితపించేది రైతన్న
దళారులతో దగాపడ్డ
నకిలీ విత్తులతో నష్టపోయిన
కరెంటు లేక పంటలెండినా
దిక్కులేక దిగాలు పడి
చూస్తున్నాడు రైతన్న....!
                                      - తోట యోగేందర్


Saturday 15 December 2012

మనసొక పిచ్చిది

మనసొక పిచ్చిది

మనసొక పిచ్చిది
తన వాళ్ళు మన వాళ్ళు
అంటూ నిత్యం తపన పడుతుంది
ఆమనసులో తరతమ
భేదం చూపక
అందరిని ఆదరిస్తే
ఆమనస్సున్న మనిషే
మహామనిషి అవుతాడు
అతడే ఆదర్శప్రాయుడౌతాడు...
                                -  తోట యోగేందర్

Thursday 13 December 2012

ఎంత హాయి గొలుపునో......

ఎంత హాయి గొలుపునో......

తెల్లని మల్లెలు
కల్మషం లేని పసిహృదయాలు
పచ్చని పంటలు
పక్షుల కిలకిలలు
చల్లని పిల్ల గాలులు
ఆకాశంలో ఇంద్రధనస్సు
వీనుల విందైన సంగీతం
సువాసనలు వెదజల్లే కుసుమాలు
గలగల పారే నదీ జలాలు
వయ్యారాలూగే పంట పొలాలు
ఎంత హాయి గొలుపునో......
                                        -  తోట యోగేంధర్

Wednesday 12 December 2012

చల్లని జాబిలి

చల్లని జాబిలి....

నిశ్శబ్ధపు వినీల గగనంలో

కారుచీకటి లో వెలుగులీను
చల్లని జాబిలి
ప్రాణి కోటి హృదయాలను
ఆనంద డోలికలలో ముంచేది జాబిలి
పసిపిల్లల మనసు దోచునీ జాబిలి
ప్రకృతిని పులికింపచేసేదీ జాబిలి
ప్రశాంతపు రాతిరిలో
చల్లని వెన్నలతో
కంటికింపైన పలుచని కాంతితో
ఆనందపు తీరాలను తాకించేది జాబిలి
                                              -  తోట యోగేందర్


Monday 10 December 2012

ఆనందం

ఆనందం

మనిషిలో ఉత్సాహం నింపుతుంది ఆనందం
కష్టాలు నష్టాలను భరించే శక్తినిచ్చు ఆనందం
ఆరోగ్యాన్నందించేదానందం
కొత్త కొత్త ఊహలకు ఊపిరిలూదేదానందం

ఆనందమే ఆరోగ్యం
...
ఆనందమే మహద్భాగ్యం
...
ఆనందమే జీవన మాధుర్యం
...
ఆనందమే జీవితానికి సాఫల్యం
..

                                     -  తోట యోగేందర్

Wednesday 5 December 2012

చినుకు... చినుకు...!

చినుకు... చినుకు...!

చినుకు చినుకు వర్షంతో
పుడమి పులకిస్తుంది
చినుకు చినుకు వర్షంతో
చెట్లు చిగిరిస్తాయి
చినుకు చినుకు వర్షంతో
నదులు ప్రవహిస్తాయి
మొక్కలు పుష్పించిన
ఫలాలనే ఇచ్చినా
పంటలే పండినా
ప్రాజెక్టులు జళకళనే పొందినా
సకల జీవి దాహార్తినే తీర్చినా
పుడమి తల్లి పచ్చని
మొక్కలతో నిండినా
వాన జల్లు మహిమే
ఆవానే రాకుంటే
పుడమంతా ఎడారే !
                                -  తోట యోగేందర్
 
 


Tuesday 4 December 2012

శుభోదయం ...!

శుభోదయం ....!

ప్రతి ఉదయం శుభోదయం
ఎన్నెన్నో కొత్త ఆశలతో
ఎన్నెన్నో ఊహలతో
నూతనోత్తేజంతో
ఉరకలెత్తే ఉత్సాహంతో
ప్రతి సూర్యోదయం
శుభోదయం
నులివెచ్చని కాంతులతో
కటిక చీకటి పారద్రోలే
అరుణ కాంతులతో
శుభోదయం
ప్రతి ఉదయం శుభోదయం
కోయిలల కుహూ కుహూ
రాగాలతో
పక్షుల కిలకిలలతో
మంచు దొంతెరలతో
చల్లని పిల్లగాలులతో
వికసించిన పుష్పాలతో
ఎన్నెన్నో వర్ణాలతో
ప్రతి ఉదయం శుభోదయం
                               -  తోట యోగేందర్


Saturday 1 December 2012

పుడమి తల్లి

పుడమి తల్లి

సకల జీవులకు ఆవాసం
ప్రాణికోటికి చక్కటి నివాసం
వెలకట్టలేని ఖనిజ సంపదతో
నిండినది మన పుడమి తల్లి
ఆకు పచ్చని వృక్షసంపదతో
కమనీయ జంతుజాలంతో
విలక్షణమైనది మన పుడమి తల్లి
గలగల పారే నదీ జలాలతో
విశాలమైన సముద్ర జలాలతో
అబ్బురపరచే పర్వతశ్రేణులతో
సోయగాలొలికే లోయలతో
అద్భుత సృష్టికి నిదర్శనం
మన పుడమి తల్లి
తరతమ బేధం చూపనిది
అందరిని అక్కున చేర్చుకునేది
మన పుడమి తల్లి
                                      - తోట యోగేందర్