Wednesday 31 December 2014

కోటి ఆశలతో స్వాగతం....

కోటి ఆశలతో స్వాగతం....
కొత్త సంవత్సరానికి
కోటి ఆశలతో స్వాగతం
పాత కాలపు సమస్యలకు
కొత్త కాలం మార్గం చూపి
నూతనోత్తేజం నింపి
కొత్త సంవత్సరం 
అందరికి కొత్త దనం చూపాలి
నిరాశ , నిస్ప్రుహలను
పారద్రోలాలి
కొత్తదనం అందించాలి
అందరి జీవితాలలో 
కొత్త వెలుగులు నింపాలి
నూతన సంవత్సర శుభాకాంక్షలతో...
        తోట యోగేందర్


Monday 21 April 2014

ఓటు విలువ

ఓటు విలువ 

ఓటు విలువ తెలుసుకో
మంచినేతను ఎన్నుకో
తులానికో , ఫలానికో 
ఆశ పడితే నువ్వు
ప్రజాస్వామ్య ఫలానికి
దూరమవుతావు
తరతరాల వెనుకబాటు
ప్రజలకేమో గ్రహపాటు
విజ్ఞతతో ఓటేస్తే 
కష్టాలు తీరును బాసు
ఆదమరిచి నిదురిస్తే
బాధ్యతనే మరిచిపోతే
సమసమాజ నిర్మాణానికి
అడ్డుగోడగ మారతావు
                                 తోట యోగేందర్, మిర్యాలగూడ.

Thursday 27 February 2014

శంభో శంకర అంటే

శంభో శంకర

శంభో శంకర అంటే
కరుణిస్తాడు
ఓం నమ: శివాయ అనే
పంచాక్షరితో కష్టాలను దూరం చేస్తాడు
గరలం మింగి 
సృష్టినంతటిని కాపాడిన పరమేశ్వరుడు
అనంత కోటి భక్తుల 
పూజలనందుకుంటూ 
ప్రాణులందరికీ శుభాలనొసగుతున్నాడు
ఓం కారంతో సృష్టికి
ఆయువు పోసిన శివుడు భక్త వత్సలుడు.
    తోట యోగేందర్

Friday 21 February 2014

ఫలించిన చిరకాల స్వప్నం...

ఫలించిన చిరకాల స్వప్నం...

ప్రత్యేక రాష్ర్టం కోసం ఎన్నో కలలు కన్నారు
ఎందరో త్యాగాలు చేశారు
సుధీర్ఘ పోరాటంలో ఎన్నో మలుపులు
పోరాటానికి ఆయువు పోసిన కేసీఆర్
తెలంగానా సమాజం ఒక్కటయ్యింది
చివరికి జఠిల సమస్య పరిష్కారానికి
సోనియా అభయం ఇచ్చింది
జాతీయ పార్టీలనెన్నింటినో ఒప్పించింది
దీంతో ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న 
తెలంగాణా ప్రజల కల నెరవేరింది
తోట యోగేందర్

Thursday 2 January 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ నూతన వత్సరం 
నింపాలి అందరి జీవితాలలో 
ఆనందోత్సాహం
భేదభావాలు రూపుమాపి
సమానత్వం ప్రసాదించాలి
అన్నివర్గాల ప్రజలకు
ఫలాలు చేకూర్చాలి
సుఖశాంతులతో 
జీవితాలు వెల్లివిరిసేలా
దీవించాలి...
                   - తోట యోగేందర్