Thursday 27 December 2012

మధురక్షణం

మధురక్షణం

ల్లి బిడ్డను ముద్దాడినపుడు
అదే మధురక్షణం
ప్రియుడు తన సఖిని హత్తుకున్నప్పుడు
అదే మధురక్షణం
జఠరాగ్నితో రగిలే జీవికి
ఆహారం దొరికితే
అదే మధురక్షణం
వినసొంపైన సంగీతం
చెవినపడ్డప్పుడు అదే మధురక్షణం
                                 -   తోట యోగేందర్

Wednesday 26 December 2012

జన్మధన్యం

జన్మధన్యం

సుగంధ పరిమళాలు వెదజల్లి
వర్ణశోభితమై ప్రకృతికి శోభనిచ్చే
పూల జన్మధన్యం
పచ్చపచ్చని చిగుల్లతో
నునులేత రెమ్మలతో
ఆహ్లాదం పంచే వృక్షజాతి జన్మధన్యం
గలగల ప్రవాహమై పారుతూ
జీవకోటి దాహం తీర్చే జలాల జన్మధన్యం
ప్రకృతి పారవశ్యానికి లోనై
పురివిప్పి నాట్యమాడే నెమలి జన్మధన్యం
పరోపకారం కోసం పాటు పడే
మహానుభావుల జన్మధన్యం
                          -  తోట యోగేందర్

Monday 24 December 2012

మానవ నైజం ...!

మానవ నైజం ...!

పుట్టుకతో లేదు ఏ కోరిక
పుట్టుకతో లేవు ఆశ నిరాశ
పుట్టుకతో లేవు భయభ్రాంతులు
బాల్యంలో మొదలైనాయి ఆశలు
యవ్వనంతో ఆకాశాన్నంటాయి
ప్రపంచమే నేర్పింది అన్నింటిని ప్రాణికోటికి
అయితే మానవజాతికి తప్ప లేదు
ఏ ఇతర ప్రాణికోటికి అత్యాశ, స్వార్ధం
ఆ రోజుకు కడుపు నింపుకుని
సంతృప్తినొందుతాయి
కాని మానవుడు తరతరాలకు
తరగని సంపద కావాలంటాడు
అందరిపై తనదే పైచేయి కావాలంటాడు
ఆ అత్యాశే నేడు మానవత్వాన్ని మింగేస్తుంది
మానవుణ్ని దానవుడిగ మారుస్తుంది
                                         - తోట యోగేందర్
 
 
 

Sunday 23 December 2012

ఇరుకౌతున్న జనావాసాలు !

ఇరుకౌతున్న జనావాసాలు !

జనాభా పెరుగుతోంది
వారితోపాటు వాహనాలు పెరుగుతున్నాయ్
ఒకప్పుడు నడిచేవారి సంఖ్య అధికం
నేడు వాహనాలకు అలవాటు పడ్డవారి సంఖ్య అధికం
బజారు కెళ్ళాలన్న ... సినిమా కెళ్ళాలన్న....
దోస్త్ ఇంటికెళ్ళాలన్న.... పర్ లాంగు దూరంలోని గుడి కెళ్ళాలన్న...
మోటార్ సైకిలో ... కారో వాడేస్తున్నారు
అంతే అసలే జనసంఖ్య పెరిగి ఉక్కిరిబిక్కిరౌతున్న జనావాసాలకు
వాహనాల సంఖ్యమితిమీరి
పార్కింగ్ చోటు లేక రోడ్లపై నిలుచుంటున్నాయి
ఈ దెబ్బకు రోడ్లన్ని ఇరుకౌతున్నాయి
ఇంకొంతకాలానికి మనిషికి రెండు, మూడు వాహనాలతో
జనసంఖ్యను వాహనాలు మించునేమో
కాలుబెట్ట సందు లేక ఇక్కట్లు తప్పవేమో...
                                                -   తోట యోగేందర్

మౌనం

మౌనం

మౌనం
మనిషిలోని మహోగ్రరూపం
మౌనం
జవాబు దొరకని
ఎన్నో ప్రశ్నలకు
అదో సమాధానం
మౌనం
మేధోమధనకు తొలిద్వారం
మౌనం
మనసులోని భావాల
ప్రవాహానికి మార్గం
                          - తోట యోగేందర్

Saturday 22 December 2012

మాతృభాషలో అభ్యసన


మాతృభాషలో అభ్యసన

మాతృభాషలో అభ్యసన
అర్ధవంతంగా జరుగుతుంది
అమ్మభాషలో అభ్యసన
అలుపెరగక జరుగుతుంది
కమ్మదనం... అమ్మదనం
మాతృభాషలో ఉన్నది
పరభాషావ్యామోహంతో
ఆంగ్లమాధ్యమంలొ చదివితే
విషయజ్ఞానం అందక
పరిపూర్ణత చేకూరదు
ప్రాధమిక విద్యనైన
మాతృభాషలో గరిపితే
మనసు పరిమళిస్తుంది
విలువలు నేర్పిస్తుంది
                                 - తోట యోగేందర్

Tuesday 18 December 2012

రైతన్న..!

రైతన్న..!

పొలాలు దున్ని
పంటలు పండించేది రైతన్న
పంటలతో జనానికి
ఆకలి తీర్చేది రైతన్న
ప్రకృతి కరుణిస్తే
దిగుబడి అందొస్తే
రైతన్నకు పండుగ
ప్రకృతి ప్రకోపిస్తే
రైతన్నకు దండగ
వానలు కురవాలని
కాలువలు నిండాలని
ప్రకృతి కరుణించాలని
ఆశపడేది రైతన్న
విత్తనాలు మొలకెత్తితే
ఆ మొలకలే మొక్కలైతే
ఆనందించేది రైతన్న
ప్రకృతి కరుణకోసం
పరితపించేది రైతన్న
దళారులతో దగాపడ్డ
నకిలీ విత్తులతో నష్టపోయిన
కరెంటు లేక పంటలెండినా
దిక్కులేక దిగాలు పడి
చూస్తున్నాడు రైతన్న....!
                                      - తోట యోగేందర్


Saturday 15 December 2012

మనసొక పిచ్చిది

మనసొక పిచ్చిది

మనసొక పిచ్చిది
తన వాళ్ళు మన వాళ్ళు
అంటూ నిత్యం తపన పడుతుంది
ఆమనసులో తరతమ
భేదం చూపక
అందరిని ఆదరిస్తే
ఆమనస్సున్న మనిషే
మహామనిషి అవుతాడు
అతడే ఆదర్శప్రాయుడౌతాడు...
                                -  తోట యోగేందర్

Thursday 13 December 2012

ఎంత హాయి గొలుపునో......

ఎంత హాయి గొలుపునో......

తెల్లని మల్లెలు
కల్మషం లేని పసిహృదయాలు
పచ్చని పంటలు
పక్షుల కిలకిలలు
చల్లని పిల్ల గాలులు
ఆకాశంలో ఇంద్రధనస్సు
వీనుల విందైన సంగీతం
సువాసనలు వెదజల్లే కుసుమాలు
గలగల పారే నదీ జలాలు
వయ్యారాలూగే పంట పొలాలు
ఎంత హాయి గొలుపునో......
                                        -  తోట యోగేంధర్

Wednesday 12 December 2012

చల్లని జాబిలి

చల్లని జాబిలి....

నిశ్శబ్ధపు వినీల గగనంలో

కారుచీకటి లో వెలుగులీను
చల్లని జాబిలి
ప్రాణి కోటి హృదయాలను
ఆనంద డోలికలలో ముంచేది జాబిలి
పసిపిల్లల మనసు దోచునీ జాబిలి
ప్రకృతిని పులికింపచేసేదీ జాబిలి
ప్రశాంతపు రాతిరిలో
చల్లని వెన్నలతో
కంటికింపైన పలుచని కాంతితో
ఆనందపు తీరాలను తాకించేది జాబిలి
                                              -  తోట యోగేందర్


Monday 10 December 2012

ఆనందం

ఆనందం

మనిషిలో ఉత్సాహం నింపుతుంది ఆనందం
కష్టాలు నష్టాలను భరించే శక్తినిచ్చు ఆనందం
ఆరోగ్యాన్నందించేదానందం
కొత్త కొత్త ఊహలకు ఊపిరిలూదేదానందం

ఆనందమే ఆరోగ్యం
...
ఆనందమే మహద్భాగ్యం
...
ఆనందమే జీవన మాధుర్యం
...
ఆనందమే జీవితానికి సాఫల్యం
..

                                     -  తోట యోగేందర్

Wednesday 5 December 2012

చినుకు... చినుకు...!

చినుకు... చినుకు...!

చినుకు చినుకు వర్షంతో
పుడమి పులకిస్తుంది
చినుకు చినుకు వర్షంతో
చెట్లు చిగిరిస్తాయి
చినుకు చినుకు వర్షంతో
నదులు ప్రవహిస్తాయి
మొక్కలు పుష్పించిన
ఫలాలనే ఇచ్చినా
పంటలే పండినా
ప్రాజెక్టులు జళకళనే పొందినా
సకల జీవి దాహార్తినే తీర్చినా
పుడమి తల్లి పచ్చని
మొక్కలతో నిండినా
వాన జల్లు మహిమే
ఆవానే రాకుంటే
పుడమంతా ఎడారే !
                                -  తోట యోగేందర్
 
 


Tuesday 4 December 2012

శుభోదయం ...!

శుభోదయం ....!

ప్రతి ఉదయం శుభోదయం
ఎన్నెన్నో కొత్త ఆశలతో
ఎన్నెన్నో ఊహలతో
నూతనోత్తేజంతో
ఉరకలెత్తే ఉత్సాహంతో
ప్రతి సూర్యోదయం
శుభోదయం
నులివెచ్చని కాంతులతో
కటిక చీకటి పారద్రోలే
అరుణ కాంతులతో
శుభోదయం
ప్రతి ఉదయం శుభోదయం
కోయిలల కుహూ కుహూ
రాగాలతో
పక్షుల కిలకిలలతో
మంచు దొంతెరలతో
చల్లని పిల్లగాలులతో
వికసించిన పుష్పాలతో
ఎన్నెన్నో వర్ణాలతో
ప్రతి ఉదయం శుభోదయం
                               -  తోట యోగేందర్


Saturday 1 December 2012

పుడమి తల్లి

పుడమి తల్లి

సకల జీవులకు ఆవాసం
ప్రాణికోటికి చక్కటి నివాసం
వెలకట్టలేని ఖనిజ సంపదతో
నిండినది మన పుడమి తల్లి
ఆకు పచ్చని వృక్షసంపదతో
కమనీయ జంతుజాలంతో
విలక్షణమైనది మన పుడమి తల్లి
గలగల పారే నదీ జలాలతో
విశాలమైన సముద్ర జలాలతో
అబ్బురపరచే పర్వతశ్రేణులతో
సోయగాలొలికే లోయలతో
అద్భుత సృష్టికి నిదర్శనం
మన పుడమి తల్లి
తరతమ బేధం చూపనిది
అందరిని అక్కున చేర్చుకునేది
మన పుడమి తల్లి
                                      - తోట యోగేందర్

Wednesday 28 November 2012

జలం జీవనాధారం !



జలం జీవనాధారం !

నీరే సకల ప్రాణికి ఆధారం
ప్రతి ప్రాణి శరీరంలో నీరే అధికం
పెరుగుతున్న జనాభాతో
పెరుగుతున్న పారిశ్రామీకరణతొ
జలమే కలుషితమై
కలుషిత జలాలే దిక్కవుతున్నవి
మరో వైపు వేల కొద్ది బోర్లతో
పాతాళ గంగను విచక్షణ వీడి తోడుతుంటే
గుక్కెడు నీటికోసం ఎందరో సామాన్యులు
అలమటిస్తున్నారు....
గ్రామాలు, పట్టణాలను బేదమే లేక
నీటికొరతను చవిచూస్తున్నారు...
ఇక నైనా నీటి పొదుపు
పాటించకుంటే భవిష్యత్తున
నీటి కొరకు యుద్దాలు తప్పవేమో.... !
                                            -  తోట యోగేందర్
 

Tuesday 27 November 2012

మాతృభాష మధురమైన భాష

మాతృభాష మధురమైన భాష

తెల్లని మల్లెల వోలె
సుగంధ పరిమళాలు వెదజల్లు
మన తెలుగు భాష
చక్కనైన పద్యం లా
వినసొంపైన పాటలా
విభిన్న శైలులలో
మనసు దోచు నీ భాష
దేశభాష లందు తెలుగు లెస్స
అని శ్రీ కృష్ణదేవ రాయలు కీర్తించిన భాష
ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ గా
విదేశీయులచే కీర్తించబడ్ద గొప్ప భాష
                                                 - తోట యోగేందర్

Sunday 25 November 2012

ఈ లోకం మందుల మయం !

ఈ లోకం మందుల మయం !



విత్తనం మొలకెత్తాలంటే మందులు
పంటలు ఏపుగ పెరగాలంటే మందులు
దిగుబడి సాధించడానికి మందులు
ప్రస్తుత వ్యవసాయం అంతా మందుల మయం
బిడ్డలు పుట్టాలంటే మందులు
ఆ బిడ్డను కనేవరకూ మందులు
ఆ బిడ్డలు పెరగడానికి మందులు
ప్రస్తుత మానవ జీవితమంతా మందుల మయం
రాబోయే రోజులలో మందులనే భోంచేయాల్సి వచ్చేనేమో
వేచి చూడాలి
                                                  -  తోట యోగేందర్


Friday 23 November 2012

బాలలు భావిభారత పౌరులు !


 

బాలలు భావిభారత పౌరులు !

 





బుడిబుడి నడకలతో
స్వచ్చమైన మనసుతో
ఆటపాటలతో అలుపెరగక
జీవనం సాగించేరు

కాని గొప్పగొప్ప చదువులు చదవాలని
పతాక స్థాయికి తమ పిల్లలు
చేరాలని మాతాపితృల ఆశ

ఆశలు తీరాలని ఆత్రుతతో
మూడేండ్లు నిండకున్న
పరిణతి సాధించకున్న
నయానో భయానో
కాన్వెంటులో చేరుస్తరు
పంజరంలొ పక్షి వోలె బాల్యాన్నె బంధిస్తర్

ప్రతిరోజు ఏం నేర్చావని
పదే పదే ప్రశ్నిస్తూ
ఒత్తిడినే కల్గిస్తరు
ఆంగ్ల మాధ్యమమైతే
విదేశాలకెళ్ళొచ్చని
డాలర్లకుడాలర్లలు
కూడబెట్టొచ్చని
పేరాశకు పోతారు
ఈనాటి మమ్మిడాడీలు

కిందపడి మీద పడి
అర్ధమయ్యి అర్ధం కాక
బట్టీ పట్టో కాపీ కొట్టో
స్కూల్ విద్య పూర్తి చేసి
కాలేజీకి వెళ్ళే సరికి
ఎంపీసీ తీసుకో
ఇంజనీరువవుతావని
బైపీసీ తీసుకో
డాక్టర్ అవుతావని
చెవులు పిండి
గోలచేసి ఆకోర్సులలో చేర్పిస్తరు

ఆకోర్సులు అర్ధం కాక
విధ్యార్ధులు తలకాయలు పట్టుకుంటరు
ఈ జీవితమె వ్యర్ధమని
ఈ బ్రతుకింతేనని
నిరాశకు లోనౌతరు
విధ్యార్ధులు బలిఅవుతరు
                                                - తోట యోగేందర్

Thursday 22 November 2012

తీరిక లేని బ్రతుకులు ....!

తీరిక లేని బ్రతుకులు ....!

కొన్ని రోజుల క్రితం మానవులు
తీరిక సమయంతో ప్రశాంతంగా బ్రతికే వారు
అప్పుడంతా సంతోషం
ఇరుగు పొరుగుతో చక్కటి అనుబంధం
ఇదిగో వదినా అదిగో వదినా అంటూ
జగమంతా ఒకే కుటుంబం
ఒకరితో ఒకరికి చెప్పలేని అనుబంధం
అప్పుడింత సాంకేతికాభివృద్ది లేనే లేదు
అయినా ఆనందం , ప్రకృతి పారవశ్యం
కాలుష్యం లేదు, మానవ మనస్సులలో కల్మషం లేదు
సత్యం, అహింసా, మానవత్వం, పరోపకారం
నిజాయితీ, స్నేహభావం లాంటి సుగుణాలే ఎక్కువ
మరిప్పుడు ........
క్షణం తీరిక లేక పరిగెడుతున్న జనం
ఒత్తిడితో సతమత మౌతున్న విధ్యార్ధి లోకం
ఇంటిల్లిపాది నిరంతరం కాలంతో పరిగెడుతున్నా
దొరకని ప్రతిఫలం
ఏది ఆనాటి విలువలతో కూడిన జీవనం
ఏది ఆనాటి అనుబంధం
ఇప్పుడంతా కల్తీ మయమయిన జీవితం
ఎక్కడుంది లోపం.........
ఎన్ని ఆవిష్కరణలొచ్చినా... ఎంత అభివృద్ది సాధించినా .....
ఇప్పటికీ మారని పేదల బ్రతుకు చిత్రం
                                       -  తోట యోగేందర్

Monday 19 November 2012

సామాన్య ఓటర్లు..

సామాన్య ఓటర్లు..


ఎటు చూసిన హడావుడి,
గెలవాలనే తపనే అది
ఆ పార్టీ ఈ పార్టీ
బేదమే లేదు మరి
ముందస్తు వచ్చేనో
సత్తాచాటాలి మరి
సామాన్య ఓటరేమో
కరువుతో , ధరలతో
అర్దం కాని సంస్కరణలతో
బెంబేలెత్తుతున్నారు మరి
ఏ పార్టీ కోటేసినా అవినీతి, బంధుప్రీతి
స్కాంలు , వంచనలు తప్ప
సామాన్యుడికి వొరిగేదేమీ లేదని
నిరాశతో , నిస్ప్రుహతో
నీళ్ళు నములుతున్నారు
రాజకీయ నేతలేమో
పాదయాత్రల హోరుతో
సమావేశాల జోరుతో
అరి చేతిలో స్వర్గాన్నే
చూపుతూ ఉంటుంటే
ఎవరి మాట నమ్మాలో
ఎవరి నిజాయితీ ఎంతో
కొలమానం దొరకక
మౌనంతో , ఓపికతో
చేష్టలుడిగి చూస్తురు సామాన్య ఓటర్లు
..
ఎన్నికలొచ్చే నాటికి
ఎవరికో ఒకరికి
ఓటేసి గెలిపించి
మనబ్రతుకు మనం
బ్రతకాలని తలచుతున్నారు
సామాన్య ఓటర్లు..
                                  -   తోట యోగేందర్

Wednesday 7 November 2012

పేదలు బక్కచిక్కిపోతున్నారు.....!


పేదలు బక్కచిక్కిపోతున్నారు
సంపన్నులు జెట్ వేగంతో దూసుకెళుతున్నారు
మూడుపూటలా సరిపడ తిండిదొరకక
దొరికినది చాలక బక్కచిక్కిపోతున్నారు పేదలు
రోజురోజు పెరుగుతున్న ఖర్చులకు
సరిపడా ధనం లేక ,
సంపాదన మార్గమే దొరకక బక్కచిక్కుతున్నారు
సొంత గూడు కట్టలేరు
పెద్దచదువులు చదవలేరు
జబ్బుపడితే వైద్యం పొందలేరు
డబ్బులేని వీళ్ళను చీదరించేవారే తప్ప జాలి చూపేవారు తక్కువ
ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా
వీరి రాత మారదు
దళారులే దండుకుంటున్నారు
బలవంతుడిదే రాజ్యం అన్న నానుడిని నిజంచేస్తున్నారు
దిక్కుతోచని పేదవాడు బిక్కుబిక్కుమంటున్నాడు
పెద్దపెద్ద అధికారులు, డబ్బులున్న మహరాజులు
అడుగడుగున కనబడినా
సహకారం, సమభావం సమ ఉజ్జీలకే ఇచ్చెదరు
సామాన్యుడి గోడు వినిపించుకునేదెవ్వరు
                                                - తోట యోగేందర్
 


Saturday 3 November 2012

2012 యుగాంతం ...... !

2012 యుగాంతం ...... !

యుగాంతం పై ఆలోచన అందరిది
ఏ విపత్తు వచ్చినా యుగాంతానికి సంకేతంగా బావిస్తున్నారు కొందరు
అసలీ యుగాంతం సాధ్యమేనా అనేది మరి కొందరి అనుమానం
నోస్ట్రడామస్ చెప్పారని కొందరు నమ్ముతుంటే,
వీరబ్రహ్మంగారి కాలజ్నానం ప్రకారం అనేది కొందరి వాదన
భూమిపైన కాలుష్యమే కారణమని కొందరంటే ,
పాపాలు పెరుగుటే కారణమని మరి కొందరి వాదన
ఏ వాదన ఎలాగున్న యుగాంతం ఎప్పుడొ
అను ప్రశ్నకు బదులు లేదు
కాలమే సమాధానం చెబుతుందని వదిలేయక తప్పదు
తోట యోగేందర్

Friday 2 November 2012

చదువు కో....

చదువు కో......


చదువు కో నీ జీవితాన్ని మలుచుకో
నీవునేర్చిన అక్షరం నీ జీవితాన్నే నిలుపుతుంది
క్షణక్షణం నీకు కొత్త జ్ఞానం పంచుతుంది
జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది
పలువురిలో అస్థిత్వం నిలుపుతుంది
భవిష్యత్ ను మలుచుకొను నేర్పునే చూపుతుంది
నినువీడక నీ వెంటే నీడలాగ తోడుంటది
జ్ఞాన జ్యోతి వెలిగిస్తది... అజ్ఞానం తొలిగిస్తది
చదువుతోనే ఆనందం ... చదువుతోనే ఆరోగ్యం...
చదువుతోనే జీవితం...
                                       - తోట యోగేందర్


Thursday 18 October 2012

సిరులు పొంగిన , విరులు నిండిన భరతజాతికి వందనం ....!

సిరులు పొంగిన , విరులు నిండిన భరతజాతికి వందనం అంటూ సాగిన పాటలో భారతదేశ ఔన్నత్యాన్ని వివరించారు కవి.   రచన : వసంతరాయ్

Wednesday 17 October 2012

మతసామరస్యం ప్రభోధించే గీతం....

మతసామరస్యం ప్రభోధించే గీతం....
ఏ దేవుడు బోధించినా, ఏ మతం చెప్పినా పేదలకు సేవచేయాలనే ఈ పాటను వినండి. వసంతరాయ్ రచించిన ఈ పాటను వినండి.

Tuesday 16 October 2012

దేశ భవితకు యువత ప్రాణం

దేశ భవితకు యువత ప్రాణం అంటూ రచయిత వసంతరాయ్ రాసిన పై పాటను వినండి. ఈ పాటలో రచయిత యువతకు చక్కటి మార్గదర్శనం చేస్తున్నారు

Monday 8 October 2012

కాలుష్య భూతం....!

కాలుష్య భూతం....!

కాలుష్య భూతం....!


పచ్చ పచ్చని మొక్కలతో
గలగల పారే స్వచ్చమైన సెలయేళ్ళతో
నిండిన ఈ భువి పై
కారు మేఘాలు కాలుష్యపు కోరలు
కమ్ముకు పోయెను
ప్రాణులన్ని మంచి నీటి కోసం,
ప్రాణవాయువు కోసం, మంచి నేల కోసం
వెతక సాగెను
ఎటు చూసినా పరిశ్రమల విషవాయువులే,
ఎటు వెళ్లినా కలుషిత జలాలే
దిక్కుతోచని ప్రాణులు బిక్కుబిక్కుమనగా
కాలుష్య భూతం వికట్టాట్ట హాసం చేసెను
ఈ ఖగోళాన్ని కబలించుట తథ్యమని ప్రకటించెను.
తోట యోగేంధర్

Wednesday 26 September 2012

The above videos is famous writer of miryalaguda T.N.S.V.B.Vasantharoys life history telecasted in etv2.

Tuesday 25 September 2012

Poorva janma sukrutame

పూర్వజన్మ సుక్రుతమే .....

పూర్వజన్మ సుక్రుతమే నిజమని నమ్మక తప్పదు
ప్రతి వ్యక్తి జీవితంలో ఎపుడో ఒకప్పుడు
కస్టమయిన సుఖమయిన ఇపుడే అనుభవించక తప్పదు
తప్పించుక చూశావో వెంటాడక అదిమానదు
తెలిసోతెలియక చేసిన తప్పులు
కాలనాగులయి కరువక మానవు
ఎవరి కర్మకు వారే బాద్యులని మరువబోకు..... చిక్కులో చిక్కుకోకు
మంచితనం , మానవత్వం, శుభాలనే కలిగించును
‍యోగేందర్

Thursday 20 September 2012

విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయాలు వెతకాలి
ప్రస్తుత సమాజంలో విద్యుత్ లేనిదే జీవనం కొనసాగించే పరిస్థితి లేదు. విద్యుత్ అంతగా మానవ జీవితంతో ముడిపడి పోయింది. కాని డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి లేదు. దీంతో విద్యుత్ కోతలు అనివార్యమౌతు న్నాయి. ఈ పరిస్థితులలో  ప్రత్యామ్నాయ ఇంధనవనరులైన సౌరశక్తి , పవనశక్తి వంటి వాటిని ప్రోత్సహించా ల్సి ఉంది. లేకపోతే రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే పలు రాశ్ర్టాలు తీవ్రమయిన విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అదనపు విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటి నుంచే తగు ప్రణాళికలు రూపొందించాలి.
                                    

Tuesday 10 July 2012

sagatujeeviki kastam

సగటు జీవికి కష్టం

సగటు మానవుడు ఇప్పుడున్న పరిస్థితులలో జీవించడం కష్టంగా మారుతుంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు కుదేలవుతున్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు సామాన్యుల జీవనం సాఫీగా  కొన సాగేలా చూడాలి.  కనీసం మూడు పూటలా తిండి తినేలా,  తలదాచుకోవడానికి  సొంత ఇళ్ళు ఉండేలా సహా యం చేయాలి. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు సామాన్యుడుని ఆందోళన పరుస్తున్నాయి. పేదవర్గాలను గుర్తిం
చి వారి అభివృద్దికి కృషి చేయాలి.  అదేవిధంగా  అనారోగ్యానికి గురైనా వైద్య ఖర్చు పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి రోగాలకు సైతం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితు
లలో పేదలు వైద్యం చేయించుకోలేకపోతున్నారు. ఇక పెద్దరోగాల భారిన పడితే కార్పోరేట్ ఆసుపత్రులలో లక్ష
ల రూపాయలు ఖర్చు చేయలేక ప్రాణాలు వదులుతున్నారు. భారత్ లాంటి పేద , మధ్యతరగతి ప్రజలు ఎక్కు
వ ఉన్న దేశాలలో వారి కనీస అవసరాల తీర్చుకునేందుకు ప్రభుత్వాలు వీలుకల్పించాలి. మూడుపూటలా ఆ
హారం తీసుకునేందుకు నిత్యావసరాల ధరల అదుపునకు ప్రభుత్వాలు ప్రాధాన్యతనివ్వాలి. పేద , మధ్యతరగతి ప్రజలు తలదాచుకోవడానికి తక్కువ ధరలలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. దీర్ఘకాలిక సమయంలో ఇంటి లోను
లను తక్కువ వడ్డీతో చెల్లించే వీలు కల్పించాలి. అలాంటి చర్యలు తీసుకునే ప్రభుత్వాలకు పేద , మధ్యతరగతి
వర్గాల మద్దతు లభిస్తుందనడంలో సందేహం లేదు.
                                                                                 - T.Yogendar

Tuesday 17 January 2012

B.Ed trianees need chance in sgt posts


బిఎడ్ వారికి ఎస్ జి టి అవకాశం కల్పించాలి
రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగ బిఎడ్ అభ్యర్దులు రాబోయే డిఎస్సీలో ఎస్ జి టి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉపాద్యాయ పోస్టులో ఎస్ జి టి ల ఖాళీలే
ఎక్కువగా ఉంటుండం , అందుకు భిన్నంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీలు తక్కువ ఉంటుండంతో
నిరుద్యోగ బిఎడ్ అభ్యర్దులు లబోదిబో మంటున్నారు. కనీసం ఏదైనా బ్రిడ్జి కోర్సు ద్వారా నైనా ఎస్ జి టి అవకాశం కల్పిస్తే తప్ప తమకు న్యాయం కలగదని ఆందోళన చెందుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీలలోను డెభై శాతం పదోన్నతులకే కేటాయిస్తుండంతో నిరుద్యోగ బిఎడ్ అభ్యర్దులు దిక్కు
తోచని స్తితిలో కొట్టుమిట్టాడుతున్నారు.