మధురక్షణం
తల్లి బిడ్డను ముద్దాడినపుడు
అదే మధురక్షణం
ప్రియుడు తన సఖిని హత్తుకున్నప్పుడు
అదే మధురక్షణం
జఠరాగ్నితో రగిలే జీవికి
ఆహారం దొరికితే
అదే మధురక్షణం
వినసొంపైన సంగీతం
చెవినపడ్డప్పుడు అదే మధురక్షణం
- తోట యోగేందర్
No comments:
Post a Comment