Monday, December 30, 2024
నైపుణ్య అభివృద్ధితో నిరుద్యోగ నిర్మూలన...!
పర్యావరణ కాలుష్యం
పర్యావరణ కాలుష్యం
పర్యావరణ కాలుష్యం మన కాలపు అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటి. ఇది మానవ ఆరోగ్యం మరియు భూ గ్రహం రెండింటికీ గణనీయమైన ప్రమాదాలను కలిగిస్తుంది. హానికరమైన పదార్థాలు సహజ వాతావరణంలోకి ప్రవేశపెట్టబడినప్పుడు ఇది సంభవిస్తుంది, ఇది పర్యావరణ వ్యవస్థలు, వన్య ప్రా ణులు మరియు ప్రజలపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. గాలి, నీరు మరియు నేల కాలుష్యంతో సహా వివిధ రకాల కాలుష్యం వివిధ వనరుల నుండి ఉద్భవిస్తుంది
వాయు కాలుష్యం ప్రధానంగా వాహనాలు, పారిశ్రామిక కార్యకలాపాలు మరియు శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల సంభవిస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు శ్వాసకోశ వ్యాధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తాయి. అంతేకాక, వాయు కాలుష్యం వాతావరణ మార్పులకు దారితీస్తుంది, ఇది వాతావరణ నమూనాలను దెబ్బతీస్తుంది మరియు జీవవైవిధ్యానికి ముప్పు కలిగిస్తుంది. గాలి నాణ్యతను మెరుగుపరచడానికి మరియు ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ప్రభుత్వాలు మరియు పరిశ్రమలు స్వచ్ఛమైన సాంకేతికతలు మరియు కఠినమైన నిబంధనలను అవలంబించడం చాలా అవసరం.
Tuesday, July 21, 2020
ఎంత పని చేసావే కరోనా...!
ఎంత పని చేసావే కరోనా...!
మనిషి శాస్త్ర విజ్ఞాన మేధస్సు కు
సవాలు విసి రావే కరోనా
ఎంత పని చేసావే కరోనా..!
మనిషి అహంకారాన్ని దెబ్బ తీసావే కరోనా
ఎంత పని చేసావే కరోనా..!
మానవ జీవితాన్ని అల్లకల్లోలం చేసావే కరోనా
ఎంత పని చేసావే కరోనా...!
మానవ సమాజంలో బయో త్పా తం సృష్టించావే కరోనా
ఎంత పని చేసావే కరోనా...!
ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరగని మహమ్మారిగా మారావే కరోనా
ఎంత పని చేసావే కరోనా...!
మానవ ప్రగతికి ప్రతిబంధకంగా మారావె కరోనా
ఎంత పని చేసావే కరోనా...!
మానవ జాతికి తీరని ద్రోహమే నీవు కరోనా...!
- తోట యోగేందర్
Thursday, March 26, 2020
కంటికి కనబడని క్రిమి...
కంటికి కనబడని క్రిమి
హడలెత్తిస్తుంది జనాన్ని
కునుకు లేకుండా చేస్తుంది ప్రపంచాన్ని
అగ్ర రాజ్యాలు సైతం వణికి పోతున్నాయి
గాలిలో దీపంలా మారాయి ప్రాణాల న్ని
ముందు జాగ్రత్త చర్యలే కాపాడాలి జనాన్ని కరచాలనం మరువాలి మనం
చేతులు జోడించి నమస్కరించడం శ్రేయస్కరం పదే పదే చేతులు కడుగడం
ముఖానికి మాస్కులు తొడగడం
అవసరమైతేనే ఇంటి నుండి బయటికి కదలడం ఇలాంటి కనీస జాగ్రత్తలు పాటించాలి ప్రతి ఒక్కరం
లేదంటే అవుతుంది మరో ఇటలీ
విజ్ఞతతో కరోనాను కట్టడి చేద్దాం మనందరం
- తోట యోగేందర్.
Wednesday, March 25, 2020
ముందు జాగ్రత్త లతో కరోనాను నివారిద్దాం...
ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి ముందు జాగ్రత్త చర్యలతోనే కట్టడి చేయాలి దాన్ని
ఒకరి నుంచి మరొకరికి దరి చేరనీయొద్దు
సామాజిక దూరం పాటిద్దాం - చేతులు తరుచూ కడుగుదాం
మాస్కులు ధరిద్దాం - పరిశుభ్రత పాటిద్దాం అప్రమత్తతే మనకు రక్ష
సామాజక బాధ్యతతో స్వీయ నియంత్రణతో ఇంటికి పరిమితమౌదాం - కరోనాను తరిమేద్దాం
- తోట యోగేందర్
కరోనా కరాళ నృత్యం....!
కరోనా కరాళ నృత్యం
Monday, October 14, 2019
ధరల పెరుగుదలే.....
రెక్కలు ముక్కలు చేసుకున్నా
తిప్పలు తప్పటం లేదు మరి ఎలా ?
రోజురోజుకూ పెరుగుతున్న
స్కూల్ ఫీజుల భారం ఒకవైపు
ఎన్ని చదువులు చదివినా
ఉద్యోగం గ్యారంటీ లేదు ఈనాడు
జీవిత పర్యంతం కష్టపడి సంపాదించినా
చాలదే చాలదు అరకొర ధనం
మరి ఏం చేయాలి మనం
అనారోగ్యం పాలైతే చుక్కలు చూపిస్తున్నాయి
ఇక చూడాల్సిందే దిక్కులు
నిత్యావసర ధరలు చూస్తుంటాయి ఆకాశం వైపు
సామాన్యులు బెంబేలెత్తి చూస్తారు దేవుడు వైపు
ఎప్పుడు తగ్గుతాయి వెతలు
సామాన్యుల జీవితాలలో మార్పు ఎప్పుడు ?
ఆదాయం పెరిగేదెప్పుడు
పేద ధనిక భేదాలు సమసిపోయేదెప్పుడు?
- తోట యోగేందర్
**వరలక్ష్మీ వ్రతం: ప్రాముఖ్యత మరియు విశిష్టత**
**వరలక్ష్మీ వ్రతం: ప్రాముఖ్యత మరియు విశిష్టత** శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంలో ఆచరించే పరమ పవిత్రమైన వ్రతం **వరలక్ష్మీ వ్ర...
-
శ్రీ రామనామం భవతారక మంత్రం... ఇల పై శ్రీరామనవమి పండుగ రోజున ఇంటింటా సందడి, ఉత్సాహం పెరిగే శుభ దినం ఉదయానే లేచి శ్రీరాముడికి నమస్కరించి, ...
-
వేకువనే మేలుకొని సూర్యునితో కరచాలనం చే యి... బద్దకం తో మునిగి నీ అమూల్య కాలాన్ని బలి చేయకు ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల గాలినే ప్రాణవాయ...
-
పరీక్షల ఒత్తిడి... నిశ్శబ్దం నిండిన పరీక్ష గదిలో ఉద్రిక్తత నిండిన మనసులు ఒత్తిడితో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కాలం వేగంగా గడిచ...