కరోనా కరాళ నృత్యం
నిన్న మొన్నటిదాకా రోడ్లన్నీ కోలాహలంగా ఉండేవి
అవి నేడు జనాలు లేక వెలవెల పోతున్నాయి
ఒకరితో ఒకరు కలిసేట్టు లేదు
ఒకరితో ఒకరు చేయి కలిపేది లేదు
ఎవరి నోట విన్నా ఒకటే మాట
అదే నేటి కరోనా వైరస్ మాట
కంటికి కనిపించని మహమ్మారి కరోన
కడగండ్లు మిగులుస్తోంది ప్రపంచాన
గొప్ప అభివృద్ది చెందిన దేశాలు సైతం
చిగురుటాకులై వణుకుతున్నాయి
ప్రజాజీవనం మొత్తం అస్తవ్యస్థమై
ఇండ్లకే పరిమితమై నిట్టూరుస్తున్నారు
పాఠశాలలు ఆఫీసులు ఒకటేమిటి
ఆన్ని విభాగాలు కుదేలౌతున్నాయి
వ్యాపారులు వ్యాపారంలేక నీరసిస్తున్నారు
రోజు వారీ కూలీలు ఉపాధి లేక విలవిలలాడుతున్నారు
కరోనా కధ ముగిసేదెన్నడో
ప్రపంచానికి ఊరట కలిగేదెన్నడో?
- తోట యోగేందర్
No comments:
Post a Comment