Friday, December 9, 2016

పచ్చని చెట్లు పంచును సంపదలు...!


పచ్చని చెట్లు 
పంచును సంపదలు
ప్రకృతి రమణీయతతో
మనోవికాసం కల్గించును
ఎన్నో ఫలాలు చల్లని గాలులు
మనుషుల వ్యధలను తీర్చే మందులు
స్వార్ధమే తెలియని మొక్కలు 
మనకిచ్చే వరాలు
తెలంగాణకు హరితహారం వేద్దాం
మొక్కలు నాటి 
హరితతెలంగాణగా మార్చుదాం.
                                                                                    -  తోట యోగేందర్,

ప్రకృతిని ప్రేమిద్దాం...!

ప్రకృతిని ప్రేమిద్దాం
ప్రకృతితో సహజీవనం చేద్దాం
పారిశ్రామిక విప్లవంతో
సహజవనరుల విచక్షణా రహిత వినియోగంతో
భూగోళం వేడెక్కుతోంది
జలచక్రం గతితప్పుతోంది
కరువు కరాళ నృత్యం చేస్తోంది
పంట భూములు బీడువారుతున్నాయి
కాలుష్య కారకాలను తగ్గించాలి
కర్బనవాయువులను  అదుపుచేయాలి
సహజ వనరుల వినియోగంలో విచక్షణ కావాలి
ఇకనైనా మేల్కొనాలి
హరితవనాలు పెంపునకు నడుంబిగించాలి
పచ్చని చెట్లే జగతికి రక్ష అని గుర్తించాలి
                                                                                            - తోట యోగేందర్,

Friday, November 25, 2016

guruvulaku vandanam...

గురువులకు వందనం
అజ్ఞానాంధకారాలను 
పారద్రోలేది మీరు
జ్ఞాన వెలుగులను
నింపేది మీరు
బ్రతక నేర్పేది మీరు
సమసమాజ నిర్మాతలు మీరు
అనిర్వచనీయమైన మీశ్రమ
చేర్చదా ఎన్నెన్నో విజయ తీరాలను
మీ విజ్ఞానం, మీ నైపుణ్యం
ఎందరో విద్యార్దులకు
కొత్త జీవితాలను ప్రసాదించాలి
                         - తోట యోగేందర్

Thursday, November 24, 2016

telanganaku manihaaram...

కవిత
తెలంగాణకు మణిహారం
అదే మన హరితహారం
పచ్చని చెట్లే ప్రగతికి మెట్లని
మొక్కలు నాటితే కరువే వుండదని
చాటి చెబుదాం
ఊరు వాడ ఏకమై
మొక్కలు నాటగ కదులుదాం
స్వచ్చమైన గాలి
ఆహ్లాదకర వాతావరణం
మొక్కలతోనె సాద్యమని గుర్తిద్దాం
హరితవనాల పెంపుతో
ప్రకృతి సమతుల్యతను సాదిద్దాం
నేడు మొక్కలు నాటి
భవిష్యత్ తరాలకు బంగరు బాటలువేద్దాం
                            - తోట యోగేందర్

pachani pairulu.....

పచ్చని పైరులు పూల తోటలు
నిండిన చెరువులు పారేవాగులు
ప్రకృతి శోభను కలుగచేసెను
హలమే పట్టి పొలమే దున్నే
శ్రామికజీవి రైతే రాజు
పసిడి పంటలు పండించేను
జనుల ఆకలి తీర్చేను
             -తోట యోగేందర్

Tuesday, March 22, 2016

జీవితం రంగుల మయం

                                 జీవితం రంగుల మయం

సంతోషంలో స్వర్ణకాంతులు వెదజల్లుతాం
పట్టరాని కోపంలో
ఎరుపెక్కిన కన్నులతో నిప్పులమై మండుతాం
విచార వదనంలో కాంతి హీనమై
నలుపు రంగు పొందుతాం
గెలుపోటములలో , సుఖసంతోషాలలో
రకరకాల రంగులు ప్రదర్శించే మనిషి
జీవితమే రంగుల మయం

హోళీ శుభాకాంక్షలతో
- తోట యోగేందర్

Thursday, March 3, 2016

ఆవిరౌతున్న భూగర్భ జలం

ఆవిరౌతున్న భూగర్భ జలం

 

                                      నీటి వృధా కల్గిస్తుంది
                                 నేడు మనందరికి మనోవ్యధ
                                       కాలుష్యం పెరిగింది
                                 అడవుల విస్తీర్ణం తరుగుతుంది
                                      భూతాపం పెరుగుతుంది
                                  వర్షాలు ముఖం చాటేస్తున్నాయి
                           కరువుకోరల్లో సమాజం  కొట్టుమిట్టాడుతోంది
                                   సహజ వనరుల పరిరక్షణకు
                                        ఇవ్వాలి ప్రాధాన్యత
                          పర్యావరణం, సహజవనరుల వినియోగం పై
                                     పెంచాలి అవగాహన
                                                                     - తోట యోగేందర్

చందమామ

చందమామ...!

 

నింగిలో మెరిసే చందమామ
చీకటిలో వెలుగులు నింపుతుంది
చంటి పిల్లల మోములో ఆనందం నింపుతుంది
మారాం చేసే పిల్లలకు ఆటవస్తువుగా మారుతుంది
చల్లని వెన్నెలతో వసంతరాగం ఆలపిస్తుంది
ప్రకృతిని పులకింప చేస్తుంది
కలువపూలకు కొత్త అందం తెస్తుంది
ప్రకృతికే కొత్త రంగులద్దుతుంది

                                                     - తోట యోగేందర్

Sunday, January 24, 2016

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


ఎందరో మహనీయుల
మేధోమధనం
భారతావనికి అందిన
రాజ్యాంగం
ప్రజాస్వామ్య విలువలకు ప్రతిరూపం
అతిపెద్ద లిఖిత గ్రంధం
ప్రపంచానికే అది ఆదర్శం
బడుగు బలహీన పీడిత జనానికి
రక్షక కవచం
సమన్యాయం స్వేచ్చా స్వాతంత్ర్యాలకు మూలం
మన రాజ్యాంగం
ఇంత గొప్ప గ్రంధానికి ప్రణమిల్లుదాం
మనమందరం.....

                                                 - తోట యోగేందర్

Friday, January 22, 2016

ప్రకృతి మాతకు వందనం

ప్రకృతి మాతకు వందనం

చల్లగాలి చేసే సవ్వడి
మనసు పలికే మౌనరాగం
పుష్ప సుగంధం
భానుడి నునులేత కిరణాలు
వసుధ కు పచ్చని రంగు నద్దే పంటపొలాలు
ఇంత అనుభూతినిచ్చే ప్రకృతి మాతకు వందనం ...
అభివందనం ........
                                                         తోట యోగేందర్

Wednesday, January 13, 2016

సంక్రాంతి శుభాకాంక్షలు.....

                          తెలుగు వాకిళ్ళ లో రంగురంగుల ముగ్గులు
                                        గంగిరెద్దుల నృత్యాలు
                                    కొత్త చిగురులతో వృక్షాలు
                                        కోకిలమ్మల పాటలు
                          ఆకాశంలో పక్షుల్లా ఎగిరే గాలి పటాలు
                            వాటిని చూస్తూ ఆనందించే పసిపిల్లలు
                                 పిండివంటల ఘుమఘుమలు
                             భోగిమంటలు... బొమ్మల కొలువులు
                         మొత్తంగా ఆనంద సాగరంలో  విహరింప చేసే
                               సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు...
                                                                      తోట యోగేందర్































































































ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...

  ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...   ఫోర్టిఫైడ్ రైస్ అనేది విటమిన్లు మరియు ఖనిజాలు వంటి అదనపు పోషకాలతో మెరుగుపరచబడిన ఒక రకమైన బియ్యం.  పోషక...