ఆబాలగోపాలాన్ని అలరిస్తున్న ప్రముఖ సాహితీవేత్త
సుదీర్ఘ కాలంగా తన రచనలతో ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న కవి ... వసంతరాయ్, నవలా రచయిత తోట వీర భోగ వసంతరాయ్. నల్లగొండ జిల్లా చండూర్ లో 1955 may 30 న జన్మించిన శ్రీ వసంతరాయ్ పాఠ శాల విద్యను అదే గ్రామంలో పూర్తిచేసుకుని సాగర్ లో ఇంటర్ విద్యను పూర్తి చేశారు. 1975 నుండి పుస్తక రచనలు ప్రారంభించారు. ఇప్పటి వరకు అరవైకి పైగా పుస్తకాలు రచించారు. ఇదీ ఈ దేశం కద, ఘజల్ రామాయణం, నల్లగొండ జిల్లా చరిత్ర , తత్వభోద , గీతోపదేశం, బాలవీరుల కదలు, డమరుద్వని, వైఎస్ శకంలో ఆంద్రప్రదేశ్ , హరివిల్లు, అగస్తేశ్వర చరిత్ర, భగ్న ప్రేమికులు, సత్యకుమార శతకం, నెహ్రూదారిలో శాస్ర్తీజీ , మహాత్మాగాందీ, శ్రీ శివస్తోత్రం, శ్రీ సీతారామకళ్యాణం, పాంచజన్యము, శుభోదయం, ఆత్మబలి,ప్ర్రేమాలయం , రణభేరి మొదలైన పుస్తకాలు ఖ్యాతి గడించాయి. 2001 నుండి 2009 వరకు నల్లగొండ జిల్లా అదికారభాషా సంఘం సభ్యులుగా పని చేశారు. 2004 లో హర్యానా లోని పాని పట్ కు చెందిన జైమినీ అకాడమీ వారు "సుభద్రా కుమారి చౌహాన్" అవార్డుతో సత్కరించారు. 2007 లో న్యూడిల్లీకి చెందిన రైఫాసి మెంటో ఇంటర్నేష్నల్ సంస్థ తను ప్రచురించిన "ఆఫ్రో ఏసియా హూస్ హూ" లో వీరి జీవిత చరిత్రను ప్రచురించింది. 2008 లో "నీలగిరి" అవార్డుతో నల్లగొండ జిల్లా కలెక్టర్ రిపబ్లిక్ దినోత్సవంలో సన్మానించారు. పత్రికా రచయితగా సుప్రసిద్దులైన వీరు 1982 నుండి ప్రపంచ శాంతి దినపత్రిక ఎడిటర్ గా నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఇదే విదంగా కవి ,రచయిత వసంతరాయ్ గారు మరెన్నో కీర్తి శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం.

No comments:
Post a Comment