Wednesday, March 21, 2018

కోకిలమ్మ పాటలు..

కవిత
కోకిలమ్మ పాటలు కొత్త చిగురు ఆశలు
జీవకోటి మైమరచే ప్రాకృతిక సొగసులు
పుడమికి శోభను తెచ్చిన ఆకుపచ్చ వన్నెలు
వేపపూల సోయగాలు మామిడి పిందెల గలగలలు
షడ్రుచుల సమ్మేళనంతో జీవిత పరమార్ధం తెలుపు  ఉగాది పచ్చడి రుచులు
తెలుగుదనం ఉట్టిపడే పండుగే ఉగాది
శుభములొసగి విజయమివ్వు హేవళంబి.
                                        -తోట యోగేందర్,

No comments:

Post a Comment

**వరలక్ష్మీ వ్రతం: ప్రాముఖ్యత మరియు విశిష్టత**

  **వరలక్ష్మీ వ్రతం: ప్రాముఖ్యత మరియు విశిష్టత** శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంలో ఆచరించే పరమ పవిత్రమైన వ్రతం **వరలక్ష్మీ వ్ర...