Saturday, November 17, 2018

బాలలు...

బాలలు
ఆటపాటలలో మునిగి తేలేటి బాలలు
ముద్దు మాటలతో మైమరిపిస్తారు
ఆనందానికి ప్రతీకలు వాళ్ళు
కల్మషం లేని పసి కూనలే బాలలు
అలసటే ఎరుగని ఆటగాళ్లు
సంతోషాన్ని పంచే ఆత్మీయ నేస్తాలు
బాలలే రేపటి ఆశాదీపాలు
                         -తోట యోగేందర్

Tuesday, October 9, 2018

బతుకమ్మ...

బతుకమ్మ
పూల పండుగ బతుకమ్మ పండుగ
తెలంగాణ నేల మీద ఘనమైన పండుగ
మగువల మనసులో నిలిచే పండుగ
రంగు రంగుల పూలతో రమ్యమైన పండుగ
మహిళల చేతుల్లో పూల సోయగం బతుకమ్మ
మగువల మనసులో భక్తి పారవశ్యం బతుకమ్మ
ఆడ బిడ్డలకు ఆత్మీయ సంబరం బతుకమ్మ పండుగ
                 -తోట యోగేందర్

Friday, September 7, 2018

ఓనమాలు దిద్దించి అక్షర జ్ఞానం కల్పించి

కవిత
ఓనమాలు దిద్దించి అక్షర జ్ఞానం కల్పించి
బ్రతుకు దెరువు నేర్పించి
సమాజంలో గౌరవ స్థానాల్లో నిలిపి
బ్రతకడానికి సరిపడ నైపుణ్యాన్ని నేర్పి
తప్పులను సరిదిద్ది సన్మార్గంలో నడిపి
మంచి నడవడికను నేర్పి
జీవితం ఆనందమయంగా మార్చి
బ్రతుకుకు కొత్త రూపు నిచ్చేది గురువులు
అలాంటి గురువులకు వందనం అభివందనం
                                   - తోట యోగేందర్

Thursday, August 23, 2018

స్వతంత్ర భారత దేశమా


కవిత
స్వతంత్ర భారత దేశమా
పెరుగుతున్న అంతరాలను చూడుమా
అంతరిక్షంలో భారత కీర్తి పతాకం ఎగరేశాం
మహిళలపై దాడులను ఆపలేక పోతున్నాం
శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించాం
బాల్య వివాహాల వార్తలు నేటికీ వింటూనే ఉన్నాం
ఆన్ లైన్లో అన్నింటిని చక్క బెడుతున్నం
ఆఫ్ లైన్లో మాత్రం మూఢవిశ్వాసాలను
నమ్ముతున్నాం
పెరుగుతున్న మేధస్సులో లేనేలేదు నిజాయితీ
లక్షలు సంపాదించాలనేదే
నేటి యువత ఫిలాసఫీ
అభివృద్ధిలో కానరాదు రియాల్టీ
ఎంత వెనకేసుకున్నామా అనేదే నేటి పరిస్థితి....?
                                             - తోట యోగేందర్ 

Wednesday, August 15, 2018

ఎగిరింది ఎగిరింది జాతీయ జెండా


స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో....
ఎగిరింది ఎగిరింది జాతీయ జెండా
నిండింది నిండింది దేశభక్తి మది నిండా
మూడు రంగులతో ముచ్చటగా
రెపరెపలాడుతూ కనువిందు చేయగా
కాషాయంతో శౌర్యం నింపి
తెలుపు రంగుతో శాంతిని పంచి
ఆకుపచ్చతో సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచి
భారత దేశపు కీర్తి పతాకం
ప్రజలలో నింపెను సోదర భావం
బ్రిటీష్ వారిని హడలెత్తించి
స్వతంత్ర భావం రేకెత్తించిన
మువ్వన్నెల పతాకమా
నీకిదే మా వందనము 
               - తోట యోగేందర్.

Wednesday, August 8, 2018

ఒకప్పుడు స్వచ్చమైన గాలి దొరికేది...!


కవిత
ఒకప్పుడు స్వచ్చమైన గాలి దొరికేది
కల్తీ లేని ఆహారం, కల్తీ లేని మనుషుల తో
జీవితం ఆనందంగా గడిచేది
కానీ నేడు కల్తీ గాలి తో అలర్జీ
కలుషిత నీటి తో  రోగాలు
కల్తీ మనుషుల తో చెప్పలేని కష్టాలు
జీవితం కష్టాల మయంగా మారింది
మనుషుల మధ్య అగాధం పెరిగింది
మనుషుల లో మార్పు రావాలి
మనమంతా బాగుండాలి
                     - తోట యోగేందర్

Wednesday, July 25, 2018

మానవులం మనం మానవులం...

కవిత
మానవులం మనం మానవులం
జీవకోటి మొత్తంలో గొప్ప తెలివైనవాళ్లం
ప్రకృతి ని చెప్పు చేతుల్లో పెట్టుకుని
శరవేగంగా విధ్వంసం చేస్తున్న మహనీయులం
చెట్టుచేమా అన్నింటిని తొలగిస్తం
ఫ్యాక్టరీల నిర్మాణంతో కాలుష్యం పెంచేస్తాం
ప్రకృతి సమతుల్యతకు విఘాతమే కల్గిస్తం
ప్రకృతి విపత్తులకు బలై పోతుంటం
ఇకనైనా మేలుకొని ప్రకృతి ని కాపాడుదాం
పచ్చని మొక్కలు పెంచి పర్యావరణం
కాపాడుదాం
                      - -తోట యోగేందర్,
                          

Wednesday, June 27, 2018

చితికిపోతున్న బ్రతుకులు....!

చితికిపోతున్న బ్రతుకులు
వాళ్లంతా రోజు కూలీలు
కోడి కూతతో లేచి
ఉన్నదాంతో వండి వార్చి
పచ్చడన్నంతో కడుపునింపుకొని
చంటిపిల్లలను సైతం గాలికొదిలేసి
పొట్ట కూటి కోసం పయనమై
బద్రతలేని ప్రయాణాలతో
కూలీ డబ్బులతో క్షేమంగా ఇల్లు చేరితే
బ్రతుకు బండి నడిచేది....
లేకుంటే ప్రాణాలు గాలిలో కలిసేది
చితికిపోతున్న బ్రతుకులలో వెలుగులు నిండేదెన్నడో...రోజు కూలీల బ్రతుకు బాగు పడేదెన్నడో?
                                         - -తోట యోగేందర్

Tuesday, June 19, 2018

భానుడి భగ భగకు విరామం...!

కవిత
భానుడి భగ భగకు విరామం
వాన చినుకులతో నేల తల్లికి అభిషేకం
బీడు భూములలో సైతం వ్యవసాయానికి సన్నాహం
కర్షక ముఖాలలో వెలిగిపోతున్న ఆశల దీపం
ఈ ఏడైనా పాడి పంటలతో ఆనందం నిండాలని ఆరాటం
నకిలీ విత్తుకు బలైపోకుండా
వడ్డీ వ్యాపారికి  దళారీల కళ్లకు చిక్కకుండా
ఎరువుల బరువులతో అప్పుల పాలు కాకుండా
ప్రకృతి విపత్తులతో పంట నష్టపోకుండా
ఈసారైనా బ్రతికి బట్టకట్టాలని రైతు పోరాటం....!
                      - తోట యోగేందర్,

Friday, June 1, 2018

మేలుకో యువతా మేలుకో

కవిత
మేలుకో యువతా మేలుకో
సమాజాన్ని సంస్కరించ పూనుకో
కండ్ల ముందే అవినీతి ఏరులై పారుతుంటే...
తీరికగా కదలకుండ కూర్చుంటావేమయ్యా
కులమత వర్గవైషమ్యాలతో
సమాజం కుళ్లిపోతుంటే
పట్టీ పట్టనట్లుగా కులాసాగా తిరుగుతావేమయ్యా
నీ పిడికిలి బిగించు అంధకారం అంతమొందించు
నీ స్వేదపు బిందువులతో నవశకాన్ని నిర్మించు
అవినీతిని ఎదురించు స్వార్ధాన్ని పారద్రోలు
నవయుగాన్ని నిర్మించు
                                    -తోట యోగేందర్,

Sunday, May 13, 2018

మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో...

మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో...

అమ్మే ఈ సృష్టికి మూలం
ఆమ్మ లేని జగతి అంతా శూన్యం
అమ్మకు లేదు ఏ స్వార్ధం
త్యాగానికి ప్రతిరూపం
ఇలలో కనిపించే దైవం
కనిపెంచి కష్టించి తన పిల్లలకే అర్పిస్తుంది జీవితం
ఇంతకు మించి చేయలేరు ఎవరూ ఏత్యాగం
ఆమ్మ మనసు గుర్తించి మసలుకొనుటే
నేటి పిల్లల కర్తవ్యం...!
                              -తోట యోగేందర్.

Tuesday, April 3, 2018

భూగర్భం ఎండిపోతుంది....

కవిత
భూగర్భం ఎండిపోతుంది
వందల ఫీట్లు తోడిన
నీటిజాడ దొరకనంటోంది
అడుగడుగున బోర్లతో
నేలతల్లి బావురుమంటోంది
తడిలేని హృదయంతో
దాహంతీర్చలేక రోదిస్తోంది
కుళాయిల దగ్గర కుస్తీలు
ట్యాంకర్లకై ఎదురుచూపులు
పల్లె పట్టణాలలో నిత్యకృత్యాలు
అభివృద్ది పేరుతో అడవులు నరికితిమి
అవసరాలకై విచ్చలవిడిగా బోర్లు తోమితిమి
పట్టణాలను కాంక్రీట్ జంగల్స్ గా మార్చితిమి
పచ్చదనం కరువై పోయే...
వర్షపు నీటికి ఇంకే దారే లేదాయే
ఇకనైనా మేల్కొనకపోతే మిగిలేది కరువేనాయే...
                           - తోట యోగేందర్,

Tuesday, March 27, 2018

తప్పు మనదే...

కవిత
తప్పు మనదే...
ఒప్పుకోకుంటే ముప్పు మనకే...
పైసలకు ఆశపడే మన ఓటింగ్
అందుకే మనకు మిగిలేది చీటింగ్
ఆత్మవిమర్శతో నడిస్తేనే భవిష్యత్ కు
మీనింగ్
లేదంటే మన బ్రతుకలన్నీ కన్ఫ్యూసింగ్
మంచికి లేనే లేదు గొప్ప రేటింగ్
మాస్ మసాలకే టీఆర్పీ రేటింగ్
అందుకే కనబడదు టీవీల్లో
మంచితనపు ఫ్లోటింగ్
ఇకనైనా మారాలి మన
బ్యాడ్ ఫాలోయింగ్
అప్పుడే సమాజంలో
మార్పు మైండ్ బ్లోయింగ్
                   - తోట యోగేందర్,

Sunday, March 25, 2018

శ్రీరామ నవమి శుభాకాంక్షలతో

శ్రీరామ నవమి శుభాకాంక్షలతో...
అందాల రాముడు నీలమేఘశ్యాముడు
ఇలపై వెలిసిన భగవత్ స్వరూపుడు
ఏకపత్నీ వ్రతుడు సోదరప్రేమలో మేటిగా నిలిచాడు
రాజ్యపాలనలో సాటిరారు రాముడికెవ్వరు
రాక్షసత్వాన్ని అణిచిన వీరుడు
మానవులందరికి ఆదర్శప్రాయుడైన
అవతారపురుషుడు
అందుకో రామా ఈ భక్తుల పూజలు
కురిపించవయ్యా  నీ కరుణా కటాక్షాలు
                    - తోట యోగేందర్.

Wednesday, March 21, 2018

కోకిలమ్మ పాటలు..

కవిత
కోకిలమ్మ పాటలు కొత్త చిగురు ఆశలు
జీవకోటి మైమరచే ప్రాకృతిక సొగసులు
పుడమికి శోభను తెచ్చిన ఆకుపచ్చ వన్నెలు
వేపపూల సోయగాలు మామిడి పిందెల గలగలలు
షడ్రుచుల సమ్మేళనంతో జీవిత పరమార్ధం తెలుపు  ఉగాది పచ్చడి రుచులు
తెలుగుదనం ఉట్టిపడే పండుగే ఉగాది
శుభములొసగి విజయమివ్వు హేవళంబి.
                                        -తోట యోగేందర్,

ఎక్కడున్నావు...

కవిత
ఎక్కడున్నావు... నువ్వెక్కడున్నావు...
మనిషితనం చచ్చిపోయి నిర్జీవివైనావు
ప్రేమ ఆప్యాయతలు ఏనాడో మరిచావు
దయా దాతృత్వం మచ్చుకైన కానరావు
దగా మోసం నేర్చి మనుషుల ఏమార్చుతావు
నీకసలేది పట్టదు సమాజం అంటే గిట్టదు
ఇరుగు పొరుగు వారినెపుడు అసూయతో చూస్తావు
కుళ్లు కుతంత్రాలతో కుమిలి చస్తుంటావు
ఎక్కడున్నావు.... నువ్వెక్కడున్నావు...
కృత్రిమ మేధస్సుతో కుస్తీపడుతున్నావు
నువ్వన్నది లేదంటూ శవమై బ్రతికున్నావు
                             - -తోట యోగేందర్,

Thursday, March 8, 2018

నేనొక సామాన్యుణ్ణి

కవిత
నేనొక సామాన్యుణ్ణి
కల్లాకపటం లేని వాణ్ణి
మాయామర్మం తెలియని వాణ్ణి
దళారుల చేతిలో బలయ్యే వాణ్ణి
అధికారదాహానికి ఆహుతయ్యేవాణ్ణి
మార్కెట్ శక్తులకు చిత్తయ్యే వాణ్ణి
దౌర్జన్యాలను భరించే వాణ్ణి
కార్పోరేట్ల దోపిడికి గురయ్యే వాణ్ణి
నేనొక సామాన్యుణ్ణి
ఈ దేశంలో ... నేనొక అసహాయుణ్ణి...
                  - -తోట యోగేందర్,

Saturday, February 24, 2018

దేశమేగతి....

కవిత
దేశమేగతి బాగుపడునోయ్
అవినీతి కోరలు పీకకుంటే
లంచగుండ్లు దళారీలు
పేదల రక్తం పీల్చెటోళ్లు
అప్పుల ఊబిలో దించెటోళ్లు
సామాన్యులపై ప్రతాపంచూపి
సంపన్నులను వదిలెటోళ్లు
దేశమంతా నిండినారు

దేశమేగతి బాగుపడునోయ్
ధర్మ విచక్షణ లేకుంటే
బ్యాంకులనే లూటీ చేసి
వేల కోట్లను దోచుతారు
స్కాంలతో దేశసంపదను
హాం ఫట్ చేయగల సమర్ధులు
                         -తోట యోగేందర్,

Tuesday, January 16, 2018

సంక్రాంతి శుభాకాంక్షలతో... కవిత

సంక్రాంతి శుభాకాంక్షలతో...
కవిత
అలసిన మనుషులకు సంక్రాంతి
తీరికలేని మనసులకు విశ్రాంతి
పరుగులమయమైన జీవితాలలో
పండుగ దినాలే నింపేను నవకాంతి
ఈ పండుగ పబ్బాలు లేకుంటే
మనుషులలో మిగిలేది అశాంతి

సంక్రాంతి పండుగొచ్చి సంబరాలు తీసుకొచ్చి
ముగ్గు పెట్టే సమయం లేని మగువలతో
ఇంటిముంగిట రంగుల హరివిల్లు ను పూయించి
కాన్వెంట్ చదువులతో కుస్తీపట్టే పిల్లలచే పతంగులను ఎగిరింపచేసి
భోగిపండ్లతో భోగభాగ్యాలను పంచి
మన సంస్కృతి సంప్రదాయాలను
భావితరాలకు పంచి
మన పండుగలే మన ఉనికిని చాటుతున్నాయి
మన జీవన విధానాన్ని సుసంపన్నం చేస్తున్నాయి
                     -తోట యోగేందర్
                      

సంక్రాంతి పండుగ

కవిత
సంక్రాంతి పండుగ సంబరాలు నిండుగ
ముంగిట ముగ్గులతో మగువల కన్నుల పండుగ
రైతుల ఇంట ధాన్యపు రాశులు సందడి చేయగ
గంగిరెద్దుల ఆటలతో గ్రామసీమ నర్తించగ
హరిదాసుల కీర్తనలతో తనువులెల్ల పులకించగ
నింగిలోన పతంగుల హరివిల్లే పూయగ
చిన్నారుల కండ్లల్లో ఆనందం వికసించగ
సంబరాల సంక్రాంతి  అంబరాన్నంటుతోంది
ఊరువాడ మైమరచి పండుగ చేస్తోంది
                           - తోట యోగేందర్,

ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...

  ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...   ఫోర్టిఫైడ్ రైస్ అనేది విటమిన్లు మరియు ఖనిజాలు వంటి అదనపు పోషకాలతో మెరుగుపరచబడిన ఒక రకమైన బియ్యం.  పోషక...