Monday, April 21, 2014

ఓటు విలువ

ఓటు విలువ 

ఓటు విలువ తెలుసుకో
మంచినేతను ఎన్నుకో
తులానికో , ఫలానికో 
ఆశ పడితే నువ్వు
ప్రజాస్వామ్య ఫలానికి
దూరమవుతావు
తరతరాల వెనుకబాటు
ప్రజలకేమో గ్రహపాటు
విజ్ఞతతో ఓటేస్తే 
కష్టాలు తీరును బాసు
ఆదమరిచి నిదురిస్తే
బాధ్యతనే మరిచిపోతే
సమసమాజ నిర్మాణానికి
అడ్డుగోడగ మారతావు
                                 తోట యోగేందర్, మిర్యాలగూడ.

No comments:

Post a Comment

వేకువనే మేలుకొని సూర్యునితో కరచాలనం చేయి...!

  వేకువనే మేలుకొని సూర్యునితో కరచాలనం చే యి... బద్దకం తో మునిగి నీ అమూల్య కాలాన్ని బలి చేయకు ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల గాలినే ప్రాణవాయ...