Thursday, August 23, 2018

స్వతంత్ర భారత దేశమా


కవిత
స్వతంత్ర భారత దేశమా
పెరుగుతున్న అంతరాలను చూడుమా
అంతరిక్షంలో భారత కీర్తి పతాకం ఎగరేశాం
మహిళలపై దాడులను ఆపలేక పోతున్నాం
శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించాం
బాల్య వివాహాల వార్తలు నేటికీ వింటూనే ఉన్నాం
ఆన్ లైన్లో అన్నింటిని చక్క బెడుతున్నం
ఆఫ్ లైన్లో మాత్రం మూఢవిశ్వాసాలను
నమ్ముతున్నాం
పెరుగుతున్న మేధస్సులో లేనేలేదు నిజాయితీ
లక్షలు సంపాదించాలనేదే
నేటి యువత ఫిలాసఫీ
అభివృద్ధిలో కానరాదు రియాల్టీ
ఎంత వెనకేసుకున్నామా అనేదే నేటి పరిస్థితి....?
                                             - తోట యోగేందర్ 

Wednesday, August 15, 2018

ఎగిరింది ఎగిరింది జాతీయ జెండా


స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో....
ఎగిరింది ఎగిరింది జాతీయ జెండా
నిండింది నిండింది దేశభక్తి మది నిండా
మూడు రంగులతో ముచ్చటగా
రెపరెపలాడుతూ కనువిందు చేయగా
కాషాయంతో శౌర్యం నింపి
తెలుపు రంగుతో శాంతిని పంచి
ఆకుపచ్చతో సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచి
భారత దేశపు కీర్తి పతాకం
ప్రజలలో నింపెను సోదర భావం
బ్రిటీష్ వారిని హడలెత్తించి
స్వతంత్ర భావం రేకెత్తించిన
మువ్వన్నెల పతాకమా
నీకిదే మా వందనము 
               - తోట యోగేందర్.

Wednesday, August 8, 2018

ఒకప్పుడు స్వచ్చమైన గాలి దొరికేది...!


కవిత
ఒకప్పుడు స్వచ్చమైన గాలి దొరికేది
కల్తీ లేని ఆహారం, కల్తీ లేని మనుషుల తో
జీవితం ఆనందంగా గడిచేది
కానీ నేడు కల్తీ గాలి తో అలర్జీ
కలుషిత నీటి తో  రోగాలు
కల్తీ మనుషుల తో చెప్పలేని కష్టాలు
జీవితం కష్టాల మయంగా మారింది
మనుషుల మధ్య అగాధం పెరిగింది
మనుషుల లో మార్పు రావాలి
మనమంతా బాగుండాలి
                     - తోట యోగేందర్

ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...

  ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...   ఫోర్టిఫైడ్ రైస్ అనేది విటమిన్లు మరియు ఖనిజాలు వంటి అదనపు పోషకాలతో మెరుగుపరచబడిన ఒక రకమైన బియ్యం.  పోషక...