Wednesday, June 27, 2018

చితికిపోతున్న బ్రతుకులు....!

చితికిపోతున్న బ్రతుకులు
వాళ్లంతా రోజు కూలీలు
కోడి కూతతో లేచి
ఉన్నదాంతో వండి వార్చి
పచ్చడన్నంతో కడుపునింపుకొని
చంటిపిల్లలను సైతం గాలికొదిలేసి
పొట్ట కూటి కోసం పయనమై
బద్రతలేని ప్రయాణాలతో
కూలీ డబ్బులతో క్షేమంగా ఇల్లు చేరితే
బ్రతుకు బండి నడిచేది....
లేకుంటే ప్రాణాలు గాలిలో కలిసేది
చితికిపోతున్న బ్రతుకులలో వెలుగులు నిండేదెన్నడో...రోజు కూలీల బ్రతుకు బాగు పడేదెన్నడో?
                                         - -తోట యోగేందర్

Tuesday, June 19, 2018

భానుడి భగ భగకు విరామం...!

కవిత
భానుడి భగ భగకు విరామం
వాన చినుకులతో నేల తల్లికి అభిషేకం
బీడు భూములలో సైతం వ్యవసాయానికి సన్నాహం
కర్షక ముఖాలలో వెలిగిపోతున్న ఆశల దీపం
ఈ ఏడైనా పాడి పంటలతో ఆనందం నిండాలని ఆరాటం
నకిలీ విత్తుకు బలైపోకుండా
వడ్డీ వ్యాపారికి  దళారీల కళ్లకు చిక్కకుండా
ఎరువుల బరువులతో అప్పుల పాలు కాకుండా
ప్రకృతి విపత్తులతో పంట నష్టపోకుండా
ఈసారైనా బ్రతికి బట్టకట్టాలని రైతు పోరాటం....!
                      - తోట యోగేందర్,

Friday, June 1, 2018

మేలుకో యువతా మేలుకో

కవిత
మేలుకో యువతా మేలుకో
సమాజాన్ని సంస్కరించ పూనుకో
కండ్ల ముందే అవినీతి ఏరులై పారుతుంటే...
తీరికగా కదలకుండ కూర్చుంటావేమయ్యా
కులమత వర్గవైషమ్యాలతో
సమాజం కుళ్లిపోతుంటే
పట్టీ పట్టనట్లుగా కులాసాగా తిరుగుతావేమయ్యా
నీ పిడికిలి బిగించు అంధకారం అంతమొందించు
నీ స్వేదపు బిందువులతో నవశకాన్ని నిర్మించు
అవినీతిని ఎదురించు స్వార్ధాన్ని పారద్రోలు
నవయుగాన్ని నిర్మించు
                                    -తోట యోగేందర్,

ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...

  ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...   ఫోర్టిఫైడ్ రైస్ అనేది విటమిన్లు మరియు ఖనిజాలు వంటి అదనపు పోషకాలతో మెరుగుపరచబడిన ఒక రకమైన బియ్యం.  పోషక...