Thursday, January 19, 2017

కవిత

కవిత
తెలుగు  లోగిళ్లలో
రంగవల్లులు
పాడిపంటలతో
పల్లె పరవళ్లు
ప్రకృతి పంచు
ఎన్నెన్నో పంటలు
చెరకు రసాలు
రంగు పతంగులు
మకర సంక్రమణంతో
దిశమార్చుకునే సూర్యుడు
ప్రకృతితో మనిషి
పెనవేసుకున్న బందానికి ప్రతీక
తెలుగుదనం ఉట్టి పడే
సంక్రాంతి పండుగ


                          - తోట యోగేందర్,
                            

Monday, January 9, 2017

కొత్త సంవత్సరం



కొత్త సంవత్సరం 
గతాన్ని మరువమంటుంది
కాలమెంత వేగమో
గుర్తుచేస్తుంది
కాలమెవరికోసం ఆగదని
కాలంతో పరిగెత్తి 
కాలక్రమంలో కల్సిపోవాల్సిందేనని
గుర్తుచేస్తుంది
వర్తమానకాలంలో
ఒదిగిపోయి జీవించాలని
భవిష్యత్ లో నీ విలువను
నిలుపుకోవాలని గుర్తుచేస్తుంది
           
                                                   -తోట యోగేందర్

ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...

  ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...   ఫోర్టిఫైడ్ రైస్ అనేది విటమిన్లు మరియు ఖనిజాలు వంటి అదనపు పోషకాలతో మెరుగుపరచబడిన ఒక రకమైన బియ్యం.  పోషక...