Wednesday, November 28, 2012

జలం జీవనాధారం !



జలం జీవనాధారం !

నీరే సకల ప్రాణికి ఆధారం
ప్రతి ప్రాణి శరీరంలో నీరే అధికం
పెరుగుతున్న జనాభాతో
పెరుగుతున్న పారిశ్రామీకరణతొ
జలమే కలుషితమై
కలుషిత జలాలే దిక్కవుతున్నవి
మరో వైపు వేల కొద్ది బోర్లతో
పాతాళ గంగను విచక్షణ వీడి తోడుతుంటే
గుక్కెడు నీటికోసం ఎందరో సామాన్యులు
అలమటిస్తున్నారు....
గ్రామాలు, పట్టణాలను బేదమే లేక
నీటికొరతను చవిచూస్తున్నారు...
ఇక నైనా నీటి పొదుపు
పాటించకుంటే భవిష్యత్తున
నీటి కొరకు యుద్దాలు తప్పవేమో.... !
                                            -  తోట యోగేందర్
 

Tuesday, November 27, 2012

మాతృభాష మధురమైన భాష

మాతృభాష మధురమైన భాష

తెల్లని మల్లెల వోలె
సుగంధ పరిమళాలు వెదజల్లు
మన తెలుగు భాష
చక్కనైన పద్యం లా
వినసొంపైన పాటలా
విభిన్న శైలులలో
మనసు దోచు నీ భాష
దేశభాష లందు తెలుగు లెస్స
అని శ్రీ కృష్ణదేవ రాయలు కీర్తించిన భాష
ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ గా
విదేశీయులచే కీర్తించబడ్ద గొప్ప భాష
                                                 - తోట యోగేందర్

Sunday, November 25, 2012

ఈ లోకం మందుల మయం !

ఈ లోకం మందుల మయం !



విత్తనం మొలకెత్తాలంటే మందులు
పంటలు ఏపుగ పెరగాలంటే మందులు
దిగుబడి సాధించడానికి మందులు
ప్రస్తుత వ్యవసాయం అంతా మందుల మయం
బిడ్డలు పుట్టాలంటే మందులు
ఆ బిడ్డను కనేవరకూ మందులు
ఆ బిడ్డలు పెరగడానికి మందులు
ప్రస్తుత మానవ జీవితమంతా మందుల మయం
రాబోయే రోజులలో మందులనే భోంచేయాల్సి వచ్చేనేమో
వేచి చూడాలి
                                                  -  తోట యోగేందర్


Friday, November 23, 2012

బాలలు భావిభారత పౌరులు !


 

బాలలు భావిభారత పౌరులు !

 





బుడిబుడి నడకలతో
స్వచ్చమైన మనసుతో
ఆటపాటలతో అలుపెరగక
జీవనం సాగించేరు

కాని గొప్పగొప్ప చదువులు చదవాలని
పతాక స్థాయికి తమ పిల్లలు
చేరాలని మాతాపితృల ఆశ

ఆశలు తీరాలని ఆత్రుతతో
మూడేండ్లు నిండకున్న
పరిణతి సాధించకున్న
నయానో భయానో
కాన్వెంటులో చేరుస్తరు
పంజరంలొ పక్షి వోలె బాల్యాన్నె బంధిస్తర్

ప్రతిరోజు ఏం నేర్చావని
పదే పదే ప్రశ్నిస్తూ
ఒత్తిడినే కల్గిస్తరు
ఆంగ్ల మాధ్యమమైతే
విదేశాలకెళ్ళొచ్చని
డాలర్లకుడాలర్లలు
కూడబెట్టొచ్చని
పేరాశకు పోతారు
ఈనాటి మమ్మిడాడీలు

కిందపడి మీద పడి
అర్ధమయ్యి అర్ధం కాక
బట్టీ పట్టో కాపీ కొట్టో
స్కూల్ విద్య పూర్తి చేసి
కాలేజీకి వెళ్ళే సరికి
ఎంపీసీ తీసుకో
ఇంజనీరువవుతావని
బైపీసీ తీసుకో
డాక్టర్ అవుతావని
చెవులు పిండి
గోలచేసి ఆకోర్సులలో చేర్పిస్తరు

ఆకోర్సులు అర్ధం కాక
విధ్యార్ధులు తలకాయలు పట్టుకుంటరు
ఈ జీవితమె వ్యర్ధమని
ఈ బ్రతుకింతేనని
నిరాశకు లోనౌతరు
విధ్యార్ధులు బలిఅవుతరు
                                                - తోట యోగేందర్

Thursday, November 22, 2012

తీరిక లేని బ్రతుకులు ....!

తీరిక లేని బ్రతుకులు ....!

కొన్ని రోజుల క్రితం మానవులు
తీరిక సమయంతో ప్రశాంతంగా బ్రతికే వారు
అప్పుడంతా సంతోషం
ఇరుగు పొరుగుతో చక్కటి అనుబంధం
ఇదిగో వదినా అదిగో వదినా అంటూ
జగమంతా ఒకే కుటుంబం
ఒకరితో ఒకరికి చెప్పలేని అనుబంధం
అప్పుడింత సాంకేతికాభివృద్ది లేనే లేదు
అయినా ఆనందం , ప్రకృతి పారవశ్యం
కాలుష్యం లేదు, మానవ మనస్సులలో కల్మషం లేదు
సత్యం, అహింసా, మానవత్వం, పరోపకారం
నిజాయితీ, స్నేహభావం లాంటి సుగుణాలే ఎక్కువ
మరిప్పుడు ........
క్షణం తీరిక లేక పరిగెడుతున్న జనం
ఒత్తిడితో సతమత మౌతున్న విధ్యార్ధి లోకం
ఇంటిల్లిపాది నిరంతరం కాలంతో పరిగెడుతున్నా
దొరకని ప్రతిఫలం
ఏది ఆనాటి విలువలతో కూడిన జీవనం
ఏది ఆనాటి అనుబంధం
ఇప్పుడంతా కల్తీ మయమయిన జీవితం
ఎక్కడుంది లోపం.........
ఎన్ని ఆవిష్కరణలొచ్చినా... ఎంత అభివృద్ది సాధించినా .....
ఇప్పటికీ మారని పేదల బ్రతుకు చిత్రం
                                       -  తోట యోగేందర్

Monday, November 19, 2012

సామాన్య ఓటర్లు..

సామాన్య ఓటర్లు..


ఎటు చూసిన హడావుడి,
గెలవాలనే తపనే అది
ఆ పార్టీ ఈ పార్టీ
బేదమే లేదు మరి
ముందస్తు వచ్చేనో
సత్తాచాటాలి మరి
సామాన్య ఓటరేమో
కరువుతో , ధరలతో
అర్దం కాని సంస్కరణలతో
బెంబేలెత్తుతున్నారు మరి
ఏ పార్టీ కోటేసినా అవినీతి, బంధుప్రీతి
స్కాంలు , వంచనలు తప్ప
సామాన్యుడికి వొరిగేదేమీ లేదని
నిరాశతో , నిస్ప్రుహతో
నీళ్ళు నములుతున్నారు
రాజకీయ నేతలేమో
పాదయాత్రల హోరుతో
సమావేశాల జోరుతో
అరి చేతిలో స్వర్గాన్నే
చూపుతూ ఉంటుంటే
ఎవరి మాట నమ్మాలో
ఎవరి నిజాయితీ ఎంతో
కొలమానం దొరకక
మౌనంతో , ఓపికతో
చేష్టలుడిగి చూస్తురు సామాన్య ఓటర్లు
..
ఎన్నికలొచ్చే నాటికి
ఎవరికో ఒకరికి
ఓటేసి గెలిపించి
మనబ్రతుకు మనం
బ్రతకాలని తలచుతున్నారు
సామాన్య ఓటర్లు..
                                  -   తోట యోగేందర్

Wednesday, November 7, 2012

పేదలు బక్కచిక్కిపోతున్నారు.....!


పేదలు బక్కచిక్కిపోతున్నారు
సంపన్నులు జెట్ వేగంతో దూసుకెళుతున్నారు
మూడుపూటలా సరిపడ తిండిదొరకక
దొరికినది చాలక బక్కచిక్కిపోతున్నారు పేదలు
రోజురోజు పెరుగుతున్న ఖర్చులకు
సరిపడా ధనం లేక ,
సంపాదన మార్గమే దొరకక బక్కచిక్కుతున్నారు
సొంత గూడు కట్టలేరు
పెద్దచదువులు చదవలేరు
జబ్బుపడితే వైద్యం పొందలేరు
డబ్బులేని వీళ్ళను చీదరించేవారే తప్ప జాలి చూపేవారు తక్కువ
ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా
వీరి రాత మారదు
దళారులే దండుకుంటున్నారు
బలవంతుడిదే రాజ్యం అన్న నానుడిని నిజంచేస్తున్నారు
దిక్కుతోచని పేదవాడు బిక్కుబిక్కుమంటున్నాడు
పెద్దపెద్ద అధికారులు, డబ్బులున్న మహరాజులు
అడుగడుగున కనబడినా
సహకారం, సమభావం సమ ఉజ్జీలకే ఇచ్చెదరు
సామాన్యుడి గోడు వినిపించుకునేదెవ్వరు
                                                - తోట యోగేందర్
 


Saturday, November 3, 2012

2012 యుగాంతం ...... !

2012 యుగాంతం ...... !

యుగాంతం పై ఆలోచన అందరిది
ఏ విపత్తు వచ్చినా యుగాంతానికి సంకేతంగా బావిస్తున్నారు కొందరు
అసలీ యుగాంతం సాధ్యమేనా అనేది మరి కొందరి అనుమానం
నోస్ట్రడామస్ చెప్పారని కొందరు నమ్ముతుంటే,
వీరబ్రహ్మంగారి కాలజ్నానం ప్రకారం అనేది కొందరి వాదన
భూమిపైన కాలుష్యమే కారణమని కొందరంటే ,
పాపాలు పెరుగుటే కారణమని మరి కొందరి వాదన
ఏ వాదన ఎలాగున్న యుగాంతం ఎప్పుడొ
అను ప్రశ్నకు బదులు లేదు
కాలమే సమాధానం చెబుతుందని వదిలేయక తప్పదు
తోట యోగేందర్

Friday, November 2, 2012

చదువు కో....

చదువు కో......


చదువు కో నీ జీవితాన్ని మలుచుకో
నీవునేర్చిన అక్షరం నీ జీవితాన్నే నిలుపుతుంది
క్షణక్షణం నీకు కొత్త జ్ఞానం పంచుతుంది
జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది
పలువురిలో అస్థిత్వం నిలుపుతుంది
భవిష్యత్ ను మలుచుకొను నేర్పునే చూపుతుంది
నినువీడక నీ వెంటే నీడలాగ తోడుంటది
జ్ఞాన జ్యోతి వెలిగిస్తది... అజ్ఞానం తొలిగిస్తది
చదువుతోనే ఆనందం ... చదువుతోనే ఆరోగ్యం...
చదువుతోనే జీవితం...
                                       - తోట యోగేందర్


ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...

  ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...   ఫోర్టిఫైడ్ రైస్ అనేది విటమిన్లు మరియు ఖనిజాలు వంటి అదనపు పోషకాలతో మెరుగుపరచబడిన ఒక రకమైన బియ్యం.  పోషక...